ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్.. 'దేవర' నుంచి మరో ట్రైలర్

'దేవర' నుంచి మరో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. సెప్టెంబర్ 22 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్ కోసం ఎక్సయిటింగ్ గా ఉన్నట్లు వరుస పోస్టులు పెడుతున్నారు.

devara trailer 2
New Update

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 27 పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. 

ఇప్పటికే దేవర ట్రైలర్ యూట్యూబ్ లో  రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తారక్ ఫ్యాన్స్ కోసం మూవీ టీమ్ మరో ట్రీట్ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయడానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబ‌ర్ 22న మేక‌ర్స్ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. 

Also Read : వెంకటేష్‌, అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో బాలయ్య రచ్చ.. వీడియో వైరల్

ఫ్యాన్స్ కోసం...

ఈ వేడుక‌లోనే చిత్ర‌బృందం రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. మేకర్స్ ఈ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్లే చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయనున్నారట. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'దేవర' రిలీజ్ ట్రైలర్ కోసం ఫుల్ ఎక్సయిటింగ్ గా ఉన్నట్లు నెట్టింట వరుస పోస్టులు పెడుతున్నారు. మరోవైపు 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22 న హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. 

గెస్టులు వీళ్ళే.. 

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇండియ‌న్ టాప్ డైరెక్టర్స్ రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ తో పాటూ 'స‌లార్' ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ న్యూస్ ఇప్పుడు మీడియా వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే  ప్రస్తుతానికి దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

#devara #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి