యాంకర్ రవి ఆడియో వైరల్.. సుడిగాలి సుధీర్‌, రవికి బిగ్ షాక్!

యాంకర్స్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డారు. ఛానల్‌లో వారు చేసిన స్కిట్‌లో సన్నీవేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు.

New Update

టీవీ షో యాంకర్స్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రముఖ ఛానల్‌లో సుడిగాలి సుధీర్, యాంకర్‌ రవి కామెడీ స్కిట్ చేశారు. ఆ స్కిట్‌లో సన్నీవేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాంకర్‌ రవికి కేశవరెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసిన మాట్లాడాడు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్షమాపణలు చెప్పనని యాంకర్ రవి తేల్చి చెప్పాడు. ఛానల్ ఓనర్లకు ఫోన్ చేసి  చెప్పుకోమని యాంకర్ రవి అన్నాడు.

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

యాంకర్ రవి తీరు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్లకు ఏం జరుగుతుందో, మీకూ అదే జరుగుతుందంటూ కేశవ రెడ్డి రవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రవితో కేశవ రెడ్డి ఆడియో బైట్ వైరల్ అవుతుంది. యాంకర్‌ రవికి కేశవరెడ్డి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు.

Also Read: IVF with AI: ప్రపంచంలోనే మొదటిసారిగా AI సాయంతో సంతానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు