Anil Ravipudi: బాలయ్యతో మళ్లీ సినిమా చేస్తా.. కథ ఇదే.. RTVతో అనిల్ రావిపూడి ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ!

'భగవంత్ కేసరి' కి నేషనల్ అవార్డు వరించిన సందర్భంగా అనిల్ రావిపూడి RTVతో మాట్లాడుతూ.. సినిమా సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. అలాగే బాలయ్యతో తదుపరి సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

New Update

Anil Ravipudi: బాలయ్య  'భగవంత్ కేసరి' సినిమాకు అవార్డుల పంట పండింది. ఇటీవలే ఉత్తమ చిత్రంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వరించించగా.. ఇప్పుడు నేషనల్ అవార్డు  సొంతం చేసుకుంది. తాజాగా  71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025  విజేతలను ప్రకటించగా.. టాలీవుడ్  నుంచి  'భగవంత్ కేసరి' సినిమాకు  ఉత్తమ చిత్రంగా  అవార్డు దక్కింది. 'భగవంత్ కేసరి' చిత్రానికి నేషనల్ అవార్డు వరించడంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిత్రబృందం సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు డైరెక్టర్ అనిల్ రావిపూడి RTV మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. 

అనిల్ రావిపూడి విత్ RTV

అనిల్ రావిపూడి మాట్లాడుతూ..'' 'భగవంత్ కేసరి' కి అవార్డు ప్రకటించగానే చాలా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ రిలీజ్ అప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను.. 'భగవంత్ కేసరి' నేను చేసిన అన్ని సినిమాల కంటే  ఒక స్పెషల్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్ ! ఎందుకంటే ఈ సినిమా జానర్ అలాంటిది. ఇప్పటికే ఈ సినిమాకు సైమా, ఐఫా, గద్దర్ అవార్డ్స్ వచ్చాయి. ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు రావడం హ్యాపీగా అనిపించింది. ''అమ్మాయిని స్ట్రాంగ్ గా ఎలా పెంచాలి'' అనే ఒక చిన్న కంటెంట్ ని నమ్ముకొని సినిమాను ముందుకు తీసుకెళ్ళాం. అదే ఈరోజు  నేషనల్ అవార్డుకి కారణమని భావిస్తున్నాము.  ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సినిమాలోని  గుడ్ టచ్ బ్యాడ్ టచ్  సీక్వెన్స్ చిన్నపిల్లలకు అవగాహన కల్పించేలా ఉంటుంది. ఇలా కంటెంట్ ఓరియెంటెడ్ గా వెళ్ళాము కాబట్టి ఈ విజయం  పాజిబుల్ అయ్యింది'' అని తెలిపారు. అలాగే బాలయ్య, శ్రీలీల, కాజల్ ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్, చిత్రబృందం ఎఫర్ట్ కూడా దీనికి కారణమని కృతజ్ఞతలు చెప్పారు. 

నెక్స్ట్ ప్రాజెక్ట్ కథ?

అనంతరం అనిల్ రావిపూడి బాలయ్యతో తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ.. మళ్ళీ బాలయ్యతో కలిసి తప్పకుండా సినిమా చేస్తాను. కాకపోతే కాస్త టైం పడుతుందని తెలిపారు. ఈసారి కూడా ఒక కొత్త, డిఫరెంట్ కథతో ముందుకొస్తానని చెప్పారు. దీంతో బాలయ్య- అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే కథ ఏమైఉంటుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఆడపిల్ల లేడీ పిల్ల లెక్క కాదు, పులి పిల్ల లెక్క ఉండాలి అంటూ మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ 'భగవత్ కేసరి' సినిమాను రూపొందించారు. 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. ఇందులో బాలయ్య  'భగవంత్ కేసరి' పాత్రలో  ఒదిగిపోయారు. తెలంగాణ యాసలో డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, శ్రీలీలతో ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇందులో కాజల్, అర్జున్ రాంపాల్, సుబ్బరాజ్, శరత్ కుమార్,  జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Also Read: 71st National Film Awards 2025: డైరెక్టర్ సుకుమార్ కూతురి సత్తా.. తొలి సినిమాతో నేషనల్ అవార్డు

Advertisment
తాజా కథనాలు