Kishkindhapuri First Single: 'భైరవం' తర్వాత హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అప్ కమింగ్ ఫిల్మ్ 'కిష్కింధపురి' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీలోని ఫస్ట్ సింగిల్ "ఉండిపోవే నాతోనే" పాటను విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడీగా రూపొందిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. సామ్ సి.ఎస్. మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఒక హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రొమాంటిక్ సైడ్ కూడా ఉండబోతుందని అర్థమవుతోంది.
In a world full of fears, all you need is a loving hand to hold ❤️ #Kishkindhapuri First Single #UndipoveNaathone lyrical out now ❤🔥
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) August 7, 2025
🔗https://t.co/liXypmMvmu
🎼 @chaitanmusic
🎤 @javedali4u
✍️ @purnachary17
🕺 #RajuSundaram@anupamahere@Koushik_psk@sahugarapati7… pic.twitter.com/lpEjGv1GNG
మిస్టరీ థ్రిల్లర్
హారర్-మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా టీజర్ విడుదల కాగా.. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు గ్రాండ్ విజువల్ ట్రీట్ అందించింది. టీజర్ లో "అహం మృత్యువు" అంటూ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 12 ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్- అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'రాక్షసుడు' సినిమా వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సైకో థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇటీవలే 'భైరవం'
ఇదిలా ఉంటే ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రదాన పాత్రలో వచ్చిన 'భైరవం' మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రోటీన్ కథ కావడంతో పెద్దగా ప్రేక్షకాదరన సొంతం చేసుకోలేదు. బాక్సాఫీసు వద్ద డీసెంట్ టాక్ తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా కూడా చేస్తున్నాడు.
'అల్లుడు శీను' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీను ఆ తరువాత తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీత, జయ జానకి నాయక పలు చిత్రాలు బాగా పేరు తెచ్చుకున్నా యి.