తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ. ఈ పండగకు ఆడపిల్లలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. మొత్తం 9 రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకల్లో గౌరమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పూజిస్తారు. భాద్రపద అమావాస్య నాడు ప్రారంభం అయ్యి మొత్తం 9 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
ఈవేడుకల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. రకరకాల పూలతో గౌరమ్మను తయారుచేసి ఆడపడుచులు ఆటపాటలతో సందడి చేస్తారు. బతుకమ్మ అంటే కేవలం పూల పండగ మాత్రమే కాదు పాటల పండుగ కూడా. బతుకమ్మ మీద ఇప్పటికే ఎన్నో పాటలు వచ్చాయి.
వాటిలో చాలావరకు హిట్ అయ్యాయి. సినిమాల్లో కంటే ప్రైవేట్ ఆల్బమ్స్ రూపంలోనే బతుకమ్మ సాంగ్స్ కి భారీ ఆదరణ దక్కడం విశేషం. ముఖ్యంగా ఫోక్ సింగర్ మంగ్లీ గత కొన్నేళ్లుగా రిలీజ్ చేసే బతుకమ్మ సాంగ్స్ ఆడియన్స్ ను విపరీతంగా అలరించాయి.
వాటితో పాటూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో,ఏమిమి పువ్వొప్పునే గౌరమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఇలా ఆడియన్స్ ను ఆకట్టుకున్న సాంగ్స్ మరెన్నో ఉన్నాయి. నేడు తెలంగాణలో సద్దుల బతుకమ్మ సందర్భంగా.. పాపులర్ బతుకమ్మ సాంగ్స్ పై ఓ లుక్కేయండి..
Also Read : టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త!