Bahubali: బాహుబలి సినిమాలో మెయిన్ లీడ్స్ శివగామి, అమరేంద్ర బాహుబలి, దేవసేన, భళ్లాలదేవల పాటు 'కట్టప్ప' పాత్ర కూడా అంతే గుర్తుండిపోతుంది. ముఖ్యంగా పార్ట్ 1 విడుదలైన తర్వాత అందరి మదిలో మెదిలిన ఒకే ప్రశ్న "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?". ఈ ప్రశ్నకు జవాబు కోసం ప్రేక్షకులు దాదాపు రెండేళ్ల పాటు ఎదురుచూశారు! అంతలా ఈ సినిమాలో 'కట్టప్ప' పాత్ర ప్రభావం చూపింది. నటుడు సత్యరాజ్ కట్టప్ప పాత్రలో జీవించేశారు. ఆయన తప్ప ఆ పాత్రకు ఇంకెవరూ సరిపోరు అనేలా పెర్ఫార్మ్ చేశారు.
మొదట మరో స్టార్ యాక్టర్
అయితే 'కట్టప్ప' పాత్ర కోసం మొదట బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని సజెస్ట్ చేశారని మీకు తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కట్టప్ప పాత్రకు సంజయ్ దత్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా సరిపోతారని భావించారట. ఆయన పర్సనాలిటీ, ఆయన వాయిస్, నటన... ఇవన్నీ కట్టప్ప పాత్రకు బలంగా నిలుస్తాయని ఆయన అనుకున్నారట. కానీ, సంజయ్ దత్ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేకపోయారని సమాచారం. అలా సంజయ్ దత్ ఈ భారీ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. మధ్యలో మోహన్ లాల్ దగ్గరికి కూడా వెళ్లిందట.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/29/first-sanjay-dutt-for-kattappa-role-2025-06-29-15-11-27.jpg)
సత్యరాజ్ కి దక్కిన ఛాన్స్
వీరెవరూ చేయలేకపోవడంతో ఆ అవకాశం నటుడు సత్యరాజ్ కి దక్కింది. ఇక సత్యరాజ్ కి కూడా కథ బాగా నచ్చడంతో ఒప్పుకోవడం.. ఆయన తప్పా ఇంకెవరూ ఆ పాత్రను చేయలేరు అనే రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సత్యరాజ్ కాకుండా ఇంకెవరైనా చేసుంటే కట్టప్ప పాత్రకు ఇంత క్రేజ్ వచ్చేది కాదేమో అని భావిస్తారు చాలా మంది!
Also Read: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!