ఒక చిన్న సినిమాగా వచ్చిన ‘బేబీ’ బాక్సాఫీసును షేక్ చేసింది. ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ధర్మపురి నితిన్ పోలీసులు తాజాగా పట్టుకున్నారు.
చైన్ స్నాచింగ్ కేసులో బేబీ నటుడు అరెస్ట్
ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లే క్రమంలో ఇద్దరు వ్యక్తులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. అమీర్ పేటలోని మైత్రీవనం ఎక్స్ రోడ్స్‌లో ఓ యువతి బస్సు కోసం వెయిట్ చేస్తుంది. అదే సమయంలో నితిన్ ఆమె వద్దకు వచ్చాడు.
ఇది కూడా చదవండి: తెలంగాణ డీఎస్పీగా ఇండియా స్టార్ క్రికెటర్.. ఎవరంటే!?
ఆమె బస్సు ఎక్కే క్రమంలో మెడల ఉన్న బంగారు చైన్‌ను లాగేసి పారిపోయాడు. దీంతో ఆమె గట్టిగా అరిచింది. అదే సమయంలో మధురా నగర్‌కు చెందిన తేజ అనే వ్యక్తి తమ బైక్‌లో పెట్రోల్ వేయడానికి బంక్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఓ మహిళ సహాయం కోసం అరుస్తున్నట్లు విన్నాడు.
ఇది కూడా చదవండి: విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’
దీంతో పారిపోతున్న నితిన్‌ను బైక్‌పై కొంత దూరం వెంబడించాడు. అనంతరం శివ అనే మరో వ్యక్తి సహాయంతో అతడిని పట్టుకున్నారు. ఆపై పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న మధురా నగర్ పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్
అతడిపై చైన్ స్నాచింగ్ కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నేరాలను అరికట్టడంలో వెంటనే స్పందించిన తేజ, శివలను డీసీపీ వెస్ట్ జోన్ ఎస్ ఎం విజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు.