BREAKING : బాలీవుడ్ లో విషాదం.. లెజెండరీ నటుడు కన్నుమూత!

ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూశారు. 83 ఏళ్ల వయసున్న దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

New Update
Deb Mukherjee

ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ శుక్రవారం కన్నుమూశారు. 83 ఏళ్ల వయసున్న దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Also read :  నిజామాబాద్ జిల్లాలో లాకప్ డెత్.. ఏజెంట్ సంపత్‌ అనుమానాస్పద మృతి

ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు

1960, 70 లలో దేబ్ ముఖర్జీ అనేక చిత్రాలలో నటించారు. ఏక్ బార్ మూస్కురా దో (1972), జో జీతా వోహి సికందర్ (1992), లాల్ పత్తర్ (1971) వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి,  దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరుగుతాయి.  

Also read :  Maharashtra: మహారాష్ట్రలో భారీ ప్రమాదం.. లారీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు

ఆయన మృతిపట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  బాలీవుడ్ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలతో పాటు, ముంబై సాంస్కృతిక రంగంలో దేబ్ ముఖర్జీ గణనీయమైన పాత్ర పోషించారు. అక్కడ జరిగే దుర్గా పూజ వేడుకల్లో ఒకటైన నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్ నిర్వాహకులలో ఆయన ఒకరు . కాగా అయాన్ ముఖర్జీ ప్రస్తుతం హృతిక్ రోషన్, ఏన్టీఆర్ లతో వార్ 2 మూవీకి  దర్శకత్వం వహిస్తున్నారు. 

Also Read :  ఆంధ్రప్రదేశ్‌లో ఈ రైల్వే స్టేషన్‌కు కేంద్రం రూ.49 కోట్లు మంజూరు

Advertisment
తాజా కథనాలు