Avika Gor: పెళ్లి పీటలేక్కబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

నటి అవికా గోర్ తన చిరకాల ప్రియుడు మిలింద్ చాంద్వానీ నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అవికా నిశ్చితార్థానికి సంబంధించిన  ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Avika Gor got engaged

Avika Gor got engaged

Avika Gor: 'చిన్నారి పెళ్లికూతురిగా' గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా తన చిరకాల ప్రియుడు మిలింద్ చాంద్వానీ ని ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని అవికా స్వయంగా తన సోషల్ మీడియాలో పంచుకుంది. అలాగే నిశ్చితార్థానికి సంబంధించిన  ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు అవిక జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి ముహూర్తానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నయి. 

avika engagement

సినిమాలు

అవిక సినిమాల విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ సరసన 'ఉయ్యాల జంపాల' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అవికాకు తెలుగులో ఆఫర్లు మొదలయ్యాయి. ఆ తర్వాత అవిక నటించిన 'సినిమా చూపిస్తా మామ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలు కూడా మంచి విజయన్ని అందుకున్నాయి. 

avika engagement pics

సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సీరీస్ లలోనూ నటించింది అవిక 'వధువూ', 'బ్రో' వంటి సీరీస్ లు చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. సినిమాల్లో కనిపించకపొయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ లేటెస్ట్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది అవికా .

Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు