టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. ఈ విషయాన్ని రష్మిక మందాన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకి తెలిపింది. ఈమేరకు రష్మిక ఓ ప్రత్యేక వీడియోను విడుదలచేసింది. అందులో గతంలో తాను ఎదుర్కొన్న డీప్ ఫేక్ వీడియోల గురించి ప్రస్తావించింది.
Also Read : మెగా - అక్కినేని హీరోల మధ్య బిగ్ ఫైట్?
" కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అది సైబర్ క్రైమ్. ఆ చేదు అనుభవం తర్వాత నేను సైబర్ క్రైమ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నా. దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలని అనుకున్నాను. తాజాగా మీ ముందుకు ఓ విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు (I4C) నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి సంతోషిస్తున్నా.
Also Read : 'దేవర' సక్సెస్ పై ఎన్టీఆర్ ఎమోషనల్.. వైరలవుతున్న పోస్ట్
దేశాన్ని కాపాడుతాను..
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. సైబర్ నేరస్థులు మనల్ని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం అలర్ట్‌గా ఉండడమే కాదు.. వాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలి. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నేను ఇలాంటి నేరాలపై అవగాహన పెంచుతాను. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడతాను.." అని వీడియోలో పేర్కొంది.
Also Read : సనాతన ధర్మం ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి..?
కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో ఇండస్ట్రీలో ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో రష్మిక డీప్ ఫేక్ బారిన పడింది. ఈ వీడియోని ఎడిట్ చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రష్మిక తర్వాత ఆలియా భట్, కత్రినా కైఫ్, కాజోల్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్స్ సైతం ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు.
Also Read : మద్యం షాపులకు లాటరీ.. ఎన్నో చిత్ర విచిత్రాలు బాబోయ్, ఆశ్చర్యపోతారు!