Arjun Son Of Vyjayanthi collections: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలో తల్లీ- కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఏప్రిల్ 18న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయిందని తెలుస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.15 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్ లో జోష్ పెంచితే తప్పా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. ఈ సినిమాకు దాదాపు రూ.45కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ ప్రకారం.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 25 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని అని ట్రేడ్ వర్గాల అంచనా.
#ArjunSonOfVyjayanthi 1st Day :
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 19, 2025
Decent and need to gain Much More Steam!
All India 1,861 Shows ₹2.87Cr, 27.84%. Gross Excluding Offline & Hires.
Estimated Actuals- Around ₹4.5Cr WW Apx. pic.twitter.com/Q7XscbSKdo
అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలో పోషించారు. అజినీష్ లోకనాథ్ సంగీతం అందించారు. సినిమాలో తల్లీ కొడుకులుగా కళ్యాణ్ రామ్, విజయశాంతి ఎమోషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.
telugu-news | cinema-news | latest-news