ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ నిన్న విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
'మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోనివిధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం..' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
దీనిపై రెహమాన్ పిల్లలు కూడా స్పందించారు. క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుకున్నారు. అయితే రెహమాన్ విడాకులు అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లోనే బృందంలోని మోహినిదే అనే సభ్యురాలు కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. మోహిని డే రెహమాన్ దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు.
Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
వోకలిస్ట్ గా, అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తుంటుంది. రెహమాన్ తో కలిసి దాదాపు 40 కాన్సర్ట్స్ చేసింది. అయితే రెహమాన్ విడాకుల వేళ తన అసిస్టెంట్ సైతం విడాకులు ప్రకటించడంతో దీనిపై నెట్టింట రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
అసిస్టెంట్ తో పెళ్లి..
రెహమాన్ తన అసిస్టెంట్ తో కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నాడని, వీరిద్దరూ కలిసి కొన్నిసార్లు వెకేషన్ కూడా వెళ్లారని, దీంతో రెహమాన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యే తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే రెహమాన్ తన అసిస్టెంట్ ను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్లను కిడ్నాప్ చేసి..!