/rtv/media/media_files/2025/04/24/f2MZXfNi3LFXbpVEX4iJ.jpg)
actress Aparna allegations on Shine Tom Chacko
#Kerala: Days after actress #VincyAloshious accused actor #ShineTomChacko of inappropriate behaviour, another actress has come forward with similar allegations. #AparnaJones, a newcomer in the industry, revealed that Shine’s conduct on the sets of the film #Sootravakyam made… pic.twitter.com/1GBCBuqIQg
— South First (@TheSouthfirst) April 24, 2025
100 శాతం నిజాలు.. నటి అపర్ణ
నటి అపర్ణ జోనస్ ఇంకా మాట్లాడుతూ.. అతడి గురించి విన్సీ పంచుకున్న అనుభవాలు 100 శాతం నిజాలు. సెట్లో నేను అతడితో కూర్చొని ఉన్నప్పుడు షైన్ నోట్లో ఏదో తెల్లటి పదార్థం ఉమ్మేసేవాడు. ఆధారాలు లేకుండా నేను దానిని డ్రగ్స్ అని చెప్పలేను.. అది గ్లూకోజ్ కూడా అయి ఉండొచ్చు. కానీ అతడి ప్రవర్తన గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సెట్ లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు.. అనవసరమైన మాటలు మాట్లాడేవారు. పరిసరాల్లో అమ్మాయిలు ఉంటే తన మాటలు మరింత అసభ్యకరంగా ఉండేవి. తన ప్రవర్తన నాకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది. వెంటనే అక్కడి సిబ్బందితో నా అసౌకర్యం గురించి చెప్పాను. దీంతో చిత్రబృందం అతడి కంటే ముందు నా షెడ్యూల్ పూర్తి చేసి పంపించారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల చట్టపరమైన చర్యల్లో పాల్గొనలేకపోతున్నాను. అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లేదానిని అని తెలిపింది నటి అపర్ణ జోన్స్
latest-news | cinema-news | actor-shine-tom-chacko