ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి దుమ్మురేపే డ్యాన్స్.. ఏపీ సర్కార్ స్కూల్ వీడియో వైరల్!

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం ZPHS జల్లూరు పాఠశాలలో తల్లి తన కూతుళ్లతో కలిసి అదిరిపోయే డాన్స్ వేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ తల్లి, కూతుళ్ళ డాన్స్ కి ఫిదా అవుతున్నారు.

New Update
mother daughter dance

mother daughter dance Photograph: (mother daughter dance )

Viral Video: మన స్కూల్ ఈవెంట్ లో మన అమ్మకు ఇష్టమైన పాటకు తనతో కలిసి డాన్స్ వేస్తే.. అబ్బా ఆ ఊహ ఎంత బాగుంటుందో కదా!  టీచర్స్, స్తూడెంట్స్ అంతా చూస్తుండగా అమ్మతో  డాన్స్  వేయడం.. ఈవెంట్ అంతా చప్పట్లతో మారుమోగడం.. అది చూసి  అమ్మ మురిసిపోవడం.. ఇవ్వని మన ముందే జరగడం.. అదొక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అంతే! జీవితంలో ఒక్కసారైనా ఇలా అమ్మతో కలిసి డాన్స్ వేయాలని చాలా ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి  సంఘటనే ఏపీలో జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు  కూతుళ్లతో కలిసి స్కూల్ స్టేజ్ పై డాన్స్ అదరగొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read:భర్తతో జ్యోతక్క బాలీ ట్రిప్.. సోషల్ మీడియాలో ఫొటోలతో సందడి

ఇద్దరు కూతుళ్లతో డాన్స్.. 

ఆఁధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం ZPHS జల్లూరు  పాఠశాలలో ఉపాధ్యాయులు,                           తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి డాన్స్ వేసింది. కూతుళ్లతో సమానంగా ఎనర్జిటిక్ గా డాన్స్ వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్ పై ఆ తల్లి కూతుళ్ళ ఆనంద క్షణాలను చూసి ఈవెంట్ అంతా చప్పట్లు, కేకలతో సందడిగా మారింది. అందరు చప్పట్లు కొడుతుంటే ఆ తల్లి, కూతుళ్లు మురిసిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు ఎంత బాగా చేశారో!  సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. తల్లి కూతుళ్ళ అనుబంధానికి ఫిదా అవుతున్నారు. 

ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
తాజా కథనాలు