నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగప్రవేశం చేశారు నందమూరి బాలకృష్ణ. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గురింప్తు సంపాదించుకున్నారు. కుర్రహీరోలతో సమానంగా ఎక్కడా తగ్గడం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు తీసి సినీ ప్రియుల్ని, నందమూరి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు.
Also Read : వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ!
అంతేకాకుండా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి మరింత చేరువవుతున్నారు. జానపద, సాంఘిక, చారిత్రక, పౌరాణిక, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ వంటి అనేక చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర సీమలో దాదాపు 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.
Also Read : లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!
ఇలా వరుస సినిమాలతో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న బాలయ్య బాబు.. మరోవైపు ఎమ్మెల్యేగా దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయాలు అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా బాలయ్య సేవలు మారుమోగుతున్నాయి. అతి తక్కువ ధరకే క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ అందిస్తూ వస్తున్నారు.
Also Read : 11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..!
పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్
ఈ తరుణంలోనే సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య చేస్తోన్న సేవలను గుర్తిస్తూ 2025 సంత్సరానికి గానూ ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. ఈ పద్మవిభూషణ్ పురష్కారం అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారం. దీనికి బాలయ్య నామినేట్ అయ్యారు.
Also Read : డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
సినిమా పరిశ్రమ, రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆయనని ఈ అవార్డుకు నామినేట్ చేసింది. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అద్మ అవార్డ్స్ 2025 నామినేషన్స్ కోసం సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. ఇందులో నామినేట్ అయిన వారి నుండి విజేతలను వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు.