Pawan Kalyan: లడ్డూ మీద జోకులా..! కార్తీ పై పవన్ ఆగ్రహం..! హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే జరిగిన 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ తిరుమల లడ్డూ ఇష్యూ పై ఫన్నీగా సెటైర్లు వేశారు. దీంతో పవన్ లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని మండిపడ్డారు. By Archana 24 Sep 2024 in సినిమా Short News New Update Karthi షేర్ చేయండి Pawan Kalya: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళ స్టార్ హీరో కార్తీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ మీద జోకులు వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కార్తీకి సూచించారు. అయితే ఇటీవలే జరిగిన కార్తీ 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ కార్తినీ లడ్డూ కావాలా నాయనా అని ఫన్నీగా అడిగింది. దానికి కార్తీ.. లడ్డూ టాపిక్ వద్దు.. ఇప్పుడు అది చాలా సున్నితమైన టాపిక్ అంటూ సెటైరికల్ గా బదులిచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. కార్తీ పై పవన్ ఆగ్రహం పవన్ మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ గురించి ఫన్ కామెంట్స్ చేయడం సరికాదు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కార్తీ కామెడీ చేశారు. అలా అనడం కరెక్ట్ కాదు. కార్తీ చేసిన కామెంట్స్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. మరో సారి అలా అనొద్దు.. నటుడిగా కార్తీ అంటే నాకు చాలా గౌరవం.. కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్స్ సరికాదు అని సూచించారు. హీరో కార్తితో పాటు లడ్డూ విషయం పై చులకనగా మాట్లాడిన నటుడు ప్రకాష్ రాజ్, పొన్నవోలు సుధాకర్ వ్యాఖ్యలను కూడా పవన్ తప్పు పట్టారు. నెయ్యి కంటే పంది కొవ్వు ధరే ఎక్కువ.. అలాంటిది పంది కొవ్వును ఆవు నెయ్యిలో ఎందుకు కలుపుతారు అంటూ పొన్నవోలు చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. ఏ విషయం గురించైనా మాట్లాడడానికి ముందు వంద సార్లు ఆలోచించాలని. ఆలోచించి మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని పవన్ స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ గుడి మెట్లను శుభ్రపరిచి అమ్మవారికి సేవ చేసుకున్నారు. అనంతరం మీడియా ముందు లడ్డూ వివాదం గురించి మాట్లాడారు. Also Read: #pawan-kalyan #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి