Anushka- Rana: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ 'ఘాటీ' ఈనెల 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. అయితే పలు కారణాల చేత నేరుగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్న అనుష్క.. ఆఫ్ స్క్రీన్ లో మూవీ ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా హీరో- రానాతో ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో పాల్గొంది అనుష్క. ఇందులో అనుష్క 'ఘాటీ' చిత్రం గురించి పలు విశేషాలను పంచుకున్నారు. అనుష్క- రానా సరదా సంభాషణలతో సాగిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
'The Queen' Anushka gets on on call with @RanaDaggubati ❤🔥
— UV Creations (@UV_Creations) September 1, 2025
▶️Watch it here now! https://t.co/rdXdPhOJYX
Two friends discuss about #Ghaati and more ✨❤️#Ghaati GRAND RELEASE WORLDWIDE ON 5th SEPTEMBER 2025.
⭐ing ‘The Queen’ @MsAnushkaShetty & @iamVikramPrabhu
🎥 Directed… pic.twitter.com/xbS4uYkV5l
అనుష్క విత్ రానా
ఘాటీ స్క్రిప్ట్ వినగానే తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఇది ఆంధ్రా- ఒడిశా బార్డర్ లో చోటుచేసుకున్న ఒక కథని చెప్పారు. బాహుబలి, అరుంధతి సినిమాల వరుసలో ఘాటీ నిలుస్తుందని అనుష్క నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే డైరెక్టర్ క్రిష్ విజన్ ని కొనియాడారు. గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల ప్రభావితమైన శీలావతి (అనుష్క పాత్ర), దేశిరాజు (విక్రమ్ ప్రభు పాత్ర) జీవితాలను చూపించిన విధానం అద్భుతమని అన్నారు. క్రిష్ తనకెప్పుడూ గొప్ప పాత్రలను ఇస్తారని, 'వేదం' లో సరోజ కూడా ఎంతో సున్నితమైన, ప్రభావమైన పాత్ర అని తెలిపారు. ఇప్పుడు 'ఘాటీ' లో శీలావతి పాత్ర కూడా అలాంటి గుర్తింపునే ఇస్తుందని చెప్పారు.
అనంతరం రానా అనుష్క సినిమాల మధ్య గ్యాప్ గురించి అడగ్గా.. మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నానని, వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలతో ముందుకొస్తానని తెలిపారు. అలాగే త్వరలోనే అందరి ముందుకు కూడా వస్తానని అన్నారు. ఈ మధ్య ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు కూడా వెళ్లడం లేదని, అందరూ ఎప్పుడు కనిపిస్తావు అని అడుగుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే ఘాటీ ప్రాజెక్ట్ సైన్ చేసినప్పుడే.. తాను ప్రమోషన్స్ లో భాగం కానని అనుష్క నిర్మాతలకు చెప్పినట్లు ఇటీవలే డైరెక్టర్ క్రిష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏదేమైనా స్వీటీని ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఘాటీ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తుండగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబా జాగర్ల మూడి నిర్మించారు. అనుష్క, విక్రమ్ ప్రభు, జపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read: Kumbh Mela Monalisa: కుంభమేళా మొనాలిసాకు మరో బంపర్ ఆఫర్.. సౌత్ స్టార్ హీరోతో సినిమా!