Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' సినిమాలో లిల్లీ పాత్రను చేయడం ఫై కర్లీ బ్యూటీ అనుపమ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పుడూ హోమ్లీగా, ట్రెడిషనల్ రోల్స్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో మాత్రం బోల్డ్ అవతార్ లో రెచ్చిపోయి అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీంతో మూవీ విడుదలైన టైంలో అనుమప పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఏంటి.. అనుపమ ఇలాంటి పాత్రకు ఒకే చేసింది అంటూ నెట్టింట తెగ చర్చ జరిగింది. అయితే తాజాగా తన లేటెస్ట్ మూవీ పరదా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ 'టిల్లు స్క్వేర్' తాను ఆ పాత్ర చేయడంపై నోరు విప్పింది. అలాంటి క్యారెక్టర్ చేయడం తనకు కూడా నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆ పాత్ర చేయడం నచ్చలేదు..!
అనుపమ మాట్లాడుతూ.. 'టిల్లు స్క్వేర్' లో నటిస్తున్న సమయంలో తాను సౌకర్యంగా ఫీల్ అవ్వలేదని చెప్పింది. చాలా సమయం తీసుకున్న తర్వాత ఆ పాత్ర చేయడానికి ఒకే చేశానుని చెప్పుకొచ్చింది. లిల్లీ పాత్ర చేయడం తనకూ నచ్చలేదని, 100% కాన్ఫిడెంట్ గా ఆ క్యారెక్టర్ చేయలేదని వివరించింది. కానీ, ఇండస్ట్రీలో నచ్చని విషయాలు చెబితే యాటిట్యూడ్ అంటరాని సంచలన వ్యాఖ్యలు చేసింది. అనుపమ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
In this candid conversation with Jeevi from https://t.co/NyzsaSsIE4, actress Anupama Parameswaran opens up about her choices, friendships, and upcoming projects.
— idlebrain.com (@idlebraindotcom) August 11, 2025
Youtube Link : https://t.co/FWsMq8Q0cN
She shares why she wasn’t comfortable doing Tillu Square, talks about how… pic.twitter.com/XZ7arbVZqb
ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం 'పరదా' ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇందులో అనుపమ 'సుబ్బు' అనే ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. ఇటీవలే మూవీ ట్రైలర్ విడుదలవగా.. పల్లెటూరి అమ్మాయిగా అనుపమ నటన, ఆమె అమాయకత్వం ఆకట్టుకున్నాయి. ఒక గ్రామం, అక్కడి కట్టుబాట్లు, ఆచారాల చుట్టూ తిరిగే కథాంశంగా 'పరదా' చిత్రాన్ని రూపొందించారు. ఈ కట్టుబాట్లు, సంప్రదాయాల సవాళ్ళను ఎదుర్కొని ఒక మహిళా ఎలా శక్తివంతంగా నిలిచింది అనే అంశాన్ని సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'పరదా' చిత్రం ఈ నెల 22న దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.
Also Read: War2 Pre Release Event: ఎవ్వడేం చేయలేడు.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ స్పీచ్ వీడియో!