'పుష్ప 2' లో 'యానిమల్' విలన్.. సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడో?

అల్లు అర్జున్ 'పుష్ప2' లో యానిమల్ విలన్ కూడా భాగం కానున్నారు. తాజాగా తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ నటుడు బ్రహ్మాజీ ఓ ఫొటో పంచుకున్నారు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్‌, ఫహాద్‌ ఫాజిల్‌ తోపాటు ‘యానిమల్‌’ ఫేమ్‌ సౌరభ్‌ సచ్‌దేవ కనిపించారు.

pushp2
New Update

Pushpa 2: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప 2' మూవీని భారీగానే ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-1 కు హ్యుజ్ రెస్పాన్స్ రావడంతో పార్ట్-2 కోసం కాస్టింగ్ నుంచి టెక్నీకాలిటీ వరకు తగ్గేదేలే అనేలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా కోసం టాప్ యాక్టర్స్ ను రంగంలోకి దింపుతున్నాడు.

Also Read : మరోసారి కొండా సురేఖకు సమంత కౌంటర్! ఏమందో తెలిస్తే షాకే

'యానిమల్' విలన్ కూడా..

తాజగా పుష్ప 2 లిప్ మరో యాక్టర్ భాగం అయ్యారు. 'యానిమల్' లాంటి పాన్ ఇండియా మూవీలో విలన్ బాబీ డియోల్ కు తమ్ముడిగా నటించిన సౌరభ్‌ సచ్‌దేవ (Saurabh Sachdeva) 'పుష్ప ది రూల్' లో నటిస్తున్నారు.  తాజాగా తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ నటుడు బ్రహ్మాజీ  ఓ ఫొటో పంచుకున్నారు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్‌, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ తోపాటు ‘యానిమల్‌’ ఫేమ్‌ సౌరభ్‌ సచ్‌దేవ కనిపించారు.

Also Read : పుష్ప ఫ్యాన్ కు పూనకాలే.. అప్డేట్ అదిరిపోయింది..

బ్రహ్మాజీ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు, సినీ అభిమానులు ‘సుకుమార్‌ భారీగానే ప్లాన్‌ చేస్తున్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీలో  ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : సంక్రాంతి రేసు నుంచి మరో సినిమా అవుట్.. అంతా ఆ నిర్మాత వల్లే..?

ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ఇంకా రిలీజ్ కు 50 రోజులు మాత్రమే ఉందని తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ స్టైల్ ఓ రేంజ్ లో ఉంది. కుర్చీపై కూర్చుని చూస్తున్న అతడి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. 

Also Read : ప్రభాస్ ను కేవలం దానికే వాడుకుంటున్నారు.. కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్

#allu-arjun #pushpa-2-the-rule
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe