మిస్సైన హ్యాట్రిక్ .. దేవి శ్రీ ప్రసాద్ కు షాకిచ్చిన అనిల్ రావిపూడి!

F2, F3 బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాము' సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు F2, F3 చిత్రాలకు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ను కాదని మరో కొత్త డైరెక్టర్ కు అవకాశమిచ్చారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

New Update

Venky- Anil: ఎఫ్2, ఎఫ్3 బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో మరోసారి జతకట్టింది.  #Anil Venky 3 అనే వర్కింగ్ టైటిల్ తో గత కొన్ని నెలల క్రితం మొదలైన వెంకీ- అనిల్ మూవీ..   ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా 'టైటిల్' కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వెంకీ మామ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 

Also Read: బాలీవుడ్ లో రష్మిక హవా.. మరో ప్రాజెక్ట్ ఒకే చేసిన బ్యూటీ.. కొత్తగా టైటిల్

'సంక్రాంతికి వస్తున్నాం'

తాజాగా  #Anil Venky 3 అఫీషియల్ టైటిల్ అనౌన్స్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ తో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మిస్సైన హ్యాట్రిక్ 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ కు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అనిల్ రావిపూడి- వెంకటేష్ కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కానీ ఈ సారి మాత్రం ఈ కాంబో వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రస్తుతం అనిల్- వెంకీ కాంబోలో తెరకెక్కుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు దేవిని కాదని మరో యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చారు.  'బలగం', మ్యాడ్, టిల్లు స్క్వేర్ వంటి సూపర్ హిట్  సినిమాలకు మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో 'సంక్రాంతికి వస్తున్నాం' కు సంగీతం అందిస్తున్నారు. అయితే  'బలగం' సినిమాలో భీమ్స్ సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. దీంతో దిల్ రాజ్ యంగ్ టాలెంట్ కు అవకాశం ఇవ్వాలని  ఉద్దేశంతో అనిల్- వెంకీ సినిమాకు అతన్ని సజెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

Also Read: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Also Read: బిగ్ సెల్యూట్.. 'అమరన్' మూవీ పై CM ప్రశంసలు!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe