80s Stars Reunion : గ్రాండ్ గా 80’S రీ యూనియన్.. ఎవరెవరు మిస్ అయ్యారంటే?

ప్రతి సంవత్సరం జరిగే 80స్ స్టార్స్ రీయూనియన్ కార్యక్రమం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినిమాకు సంబంధించిన వివిధ భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) 1980వ దశకంలో వెండితెరను ఏలిన సినీ తారలు ఈ ప్రత్యేక సమావేశంలో పాలుపంచుకున్నారు.

New Update
chiru

ప్రతి సంవత్సరం జరిగే 80స్ స్టార్స్ రీయూనియన్ కార్యక్రమం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినిమాకు సంబంధించిన వివిధ భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) 1980వ దశకంలో వెండితెరను ఏలిన సినీ తారలు ఈ ప్రత్యేక సమావేశంలో పాలుపంచుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రాధికా శరత్‌కుమార్, సుహాసిని మణిరత్నం, వెంకటేష్, మోహన్‌లాల్, నరేష్, ప్రభు, రషీన్ రెహమాన్, భానుచందర్, సురేష్, మీనా, సుమలత, ఖుష్భూ, రాధ. జయసుధ, గీత, నదియ, రమ్యకృష్ణ వంటి అనేక మంది అగ్ర తారలు హాజరయ్యారు.

 ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ తో ఈ రీయూనియన్ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆ థీమ్‌కు తగ్గట్టుగా నటీనటులంతా ప్రత్యేక దుస్తులలో హాజరై సందడి చేశారు. ఈ సమావేశానికి హాజరైన తారలు తమ సినీ కెరీర్‌లో ఒకరితో ఒకరు పనిచేసినా, పనిచేయకపోయినా, ఈ వేదికపై మాత్రం ఒకే కుటుంబ సభ్యులుగా కలిసిపోతారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటారు.  

సోషల్ మీడియాలో వైరల్

ఈ కలయికలో సినీ తారలంతా కలిసి గతంలో తమకు సంబంధించిన సరదా సంఘటనలు, షూటింగ్ అనుభవాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తెలుగు నుంచి  నాగార్జున, బాలకృష్ణ, తమిళ్ నుంచి కమల్ హాసన్, రజినీకాంత్, మళయాళం నుంచి మమ్ముట్టి,  మోహన్ లాల్ లాంటి స్టార్స్ అటెండ్ కాలేదు. 

Advertisment
తాజా కథనాలు