/rtv/media/media_files/2025/11/10/allu-sirish-2025-11-10-19-49-08.jpg)
Allu Sirish
Allu Sirish: అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో ఆయన స్టైల్, ఫ్యాషన్ సెన్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో శిరీష్ ధరించిన విక్టోరియన్ డైమండ్ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఆయన ఫ్యాషన్ సెన్స్ ని కనబరిచింది. సాధారణంగా కొద్దిమంది మగవారు మాత్రమే ఈ తరహా ఆభరణాలు ధరించడానికి సాహసిస్తారు. కానీ, శిరీష్ దీనిని చక్కగా, ఎంతో హుందాగా క్యారీ చేసి ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. మగవారి స్టైల్, ఫ్యాషన్ విషయంలో నయా ట్రెండ్ క్రియేట్ చేశారు.
అల్లు ఫ్యాషన్ సెన్స్
అలాగే శిరీష్ ఎంపిక చేసుకున్న ఈ ఆభరణం లగ్జరీ ఫ్యాషన్‌లో పురుషుల ఆభరణాలప్రాముఖ్యత పెరుగుతున్న విషయాన్ని సూచించింది. ఫ్యాషన్ విషయంలో అల్లు కుటుంబం ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందని ఈ వేడుక మరోసారి నిరూపించింది.
శిరీష్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ప్రత్యేకమైన ఐవరీ క్రీమ్ కలర్ రంగు షేర్వానీని ధరించారు. దీనికి స్టైల్ స్టేట్మెంట్ గా విక్టోరియన్ డైమండ్ నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ అవుట్ ఫిట్ శిరీష్ ఎంతో స్టైలిష్ అండ్ రాయల్ లుక్ లో కనిపించారు.
Also Read: Raja Saab Songs: సాంగ్ రూమర్స్ పై స్పందించిన 'రాజాసాబ్' టీమ్.. ఫస్ట్ సింగిల్ ఆన్ ది వే!!
Follow Us