Allu Kanakaratnam: కనకరత్నమ్మ కారణంగానే చిరు-సురేఖ పెళ్లి.. అల్లు-మెగా ఫ్యామిలీని ఆమె ఎలా కలిపారంటే?

చిరంజీవికి సురేఖతో పెళ్లి జరగడానికి ప్రధాన కారణం కనకరత్నమ్మ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అల్లు రామలింగయ్య కంటే ముందు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమెనే ప్రొపోజ్ చేశారట.  దీనికి వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

New Update
allu Kanakaratnam

allu Kanakaratnam

 Allu Kanakaratnam: అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో అల్లు, మెగా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అత్తగారి మరణ వార్త తెలియడంతో మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అలాగే కనకరత్నమ్మ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చిరంజీవి- అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే అల్లు కనకరత్నం చిరంజీవి జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. చిరంజీవికి సురేఖతో పెళ్లి జరగడానికి ప్రధాన కారణం కనకరత్నమ్మ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అల్లు రామలింగయ్య కంటే ముందు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె ప్రొపోజ్ చేశారట.  దీనికి వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అలా కలిసిన అల్లు- మెగా

చిరంజీవి నటుడిగా సినిమాల్లోనిలదొక్కుకుంటున్న రోజులవి. అప్పటికే పలు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఒకరోజు చిరంజీవి సత్యనారాయణ అనే వ్యక్తిని కలవడానికి అల్లు రామలింగయ్య ఇంటికి వెళ్లారట. సత్యనారాయణ  అల్లు రాంలింగయ్యకు దగ్గరి బంధువు కావడంతో  వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవారు. 

 అలా  చిరు అల్లు వారింటికి ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ చిరంజీవిని చూశారట. ఆయన నడవడిక, వ్యక్తిత్వం, మాటతీరు కనకరత్నమ్మకు  బాగా  నచ్చాయట. దీంతో అల్లు రామలింగయ్యకు చిరంజీవికి గురించి చెప్పి.. తమ కూతురు సురేఖను చిరంజీవికి ఇస్తే బాగుంటుందని ప్రపోజ్ చేశారట.  మొదట్లో అల్లు రామలింగయ్య దీనికి ఒప్పుకోలేదట. అతడు సినిమా ఫీల్డ్ ఇదంతా సెట్ అవుతుందా అని అనుకున్నారట. అయితే  అప్పుడే అసలు కథ మొదలైంది. 

అనుకోకుండా  అదే సమయంలో  'మన ఊరు పాండవులు షూటింగ్'  కోసం అల్లు రామలింగయ్య 15 రోజులు  చిరంజీవితో పాటు ఉండాల్సి వచ్చింది. దీంతో  ఓవైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు  చిరంజీవి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు రామలింగయ్య.  అబ్బాయి  ఎలాంటి వాడు, ఏం అలవాట్లు ఉన్నాయని చిరంజీవికి  తెలియకుండానే మెల్లిగా  బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్  చేశారు. ఇలా  అన్ని విషయాలు కనుకున్న  అల్లు రామలింగయ్య.. చిరు మంచి బుద్దిమంతుడు, వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని తెలుసుకున్నారట. అయినప్పటికీ అల్లు రామలింగయ్య ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారట.

అప్పుడు అల్లు  కుటుంబానికి బాగా సన్నిహితుడైన డీవీ. ఎస్ రాజుతో రామలింగయ్య ఈ ప్రపోజల్ గురించి ఆలోచించారట. దీంతో డీవీ ఎస్ రాజు..  ''మంచి అబ్బాయని మీరే చెప్తున్నారు ఇంకా సందేహమెందుకు, ఇక సినిమా ఫీల్డ్ అని ఆలోచిస్తే మీరు  కూడా సినిమా వాళ్ళే కదా, అలాంటప్పుడు సినిమాకు చెందిన అబ్బాయిని ఇంటి అల్లుడిగా తెచ్చుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అన్నారట. ఇక కనకరత్నమ్మ కూడా చిరంజీవిపై గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారట. ఆ తరువాత సురేఖ కూడా చిరంజీవిని ఇష్టపడటంతో మెగా వెడ్స్ అల్లు శుభలేఖ ప్రింట్ అయ్యింది. ఈ విధంగా చిరంజీవి, సురేఖల పెళ్లి జరగడానికి మూలం అల్లు కనకరత్నం.  ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

Also Read: VIDEO VIRAL: వెక్కి వెక్కి ఏడ్చిన అల్లు అర్జున్.. ఓదార్చిన చిరు.. బలగం సీన్ రిపీట్!

Advertisment
తాజా కథనాలు