/rtv/media/media_files/2024/11/16/lfH443sm6B5WHeHu4nqy.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ల మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా 19 రోజులే ఉంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తూ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే రష్మిక మందన్నా కొత్త పోస్టర్‌తో పాటు, శ్రీలీల పోస్టర్‌ను పంచుకున్న మేకర్స్.. తాజాగా ట్రైలర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. రేపు 'పుష్ప 2' ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17 (ఆదివారం)న సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
2x Rage
— Mythri Movie Makers (@MythriOfficial) November 16, 2024
2x power
2x Destruction 🔥🔥🔥#Pushpa2TheRuleTrailer tomorrow at 6:03 PM🌋🌋🌋🌋#Pushpa2TheRule pic.twitter.com/ipQzc5SeX5
Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ
పుష్పరాజ్ మాస్ అవతార్..
ఈ సందర్భంగా 'పుష్ప2' నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్ అల్లు అర్జున్ రెండు చేతులతో రెండు గొడ్డళ్లు పట్టుకొని మాస్ అవతార్ లో కనిపించాడు. ఈ పోస్టర్ ట్రైలర్ పై ఆసక్తిని మరింత పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కేలవం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టినట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.660 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
Also Read : మూడు నెలల జీతం బ్రో.. మహేష్ టీ షర్ట్ ధర అన్ని వేలా?