BREAKING : ఏపీలో అల్లు అర్జున్ కు షాక్.. 'పుష్ప2' థియేటర్లు సీజ్

‘పుష్ప-2’ థియేటర్లు సీజ్ అయ్యాయి. కుప్పంలో పుష్ప సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, NOC సర్టిఫికెట్ లేకుండా ప్రదర్శనలు చేస్తున్నారంటూ నోటీసులిచ్చారు.

New Update
bunny001

ఆంధ్రప్రదేశ్ లో అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. ఆయన హీరోగా నటించిన 'పుష్ప2' సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్స్ సీజ్ అయ్యాయి. డిసెంబర్ 05 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప-2’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. 

అయితే తాజాగా కుప్పంలో 'పుష్ప2' సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, NOC సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శనలు చేస్తున్నారంటూ నోటీసులిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు