నీకు, నీ కొడుక్కి, నీ తమ్ముడికి నేనే బాస్.. మెగా హీరోలకు బన్నీ వార్నింగ్

'పుష్ప2'లో అల్లు అర్జున్.. నీకు, నీ కొడుక్కు, నీ తమ్ముడికి నేనే బాస్..' అనే డైలాగ్ చెబుతాడు. బన్నీఈ డైలాగ్ ను మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఉద్దేశించి అన్నాడని ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.

New Update
pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో బన్నీ డైలాగ్స్, యాక్షన్, డ్యాన్స్ ఇలా ప్రతీ ఎలివెంట్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 

మెగా హీరోలకు బన్నీ వార్నింగ్..

అయితే సినిమాల్లో అల్లు అర్జున్ చెప్పే ఓ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ డైలాగ్ బన్నీ.. మెగా హీరోలను ఉద్దేశించి అన్నాడని ఫ్యాన్స్ నెట్టింట వరుస పోస్టులు పెడుతున్నారు. సినిమాలోని ఓ సందర్భంలో పుష్ప.. నీకు, నీ కొడుక్కు, నీ తమ్ముడికి నేనే బాస్..' అనే డైలాగ్ చెబుతాడు. 

ఆ డైలాగ్ మెగా హీరోలకు సరిగ్గా సూట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య మెగా హీరోలతో అల్లు అర్జున్ కు అస్సలు పడటం లేదు. బన్నీ మూవీకి ఒక్క మెగా హీరో కూడా సపోర్ట్ చేయలేదు. అందుకే సినిమాలో బన్నీ చెప్పిన ఆ డైలాగ్ కు మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీపై అల్లు ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు