Allu Arjun- Atlee: పుష్ప 2: ది రూల్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బన్నీ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చిత్రబృదం మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ బయటకు వచ్చింది.
On Sunday, #AlluArjun - #Atlee duo conducted a look test & concept photoshoot at Mehboob Studios in Bandra,Mumbai.
— Allu Arjun FC (@AlluArjunHCF) April 21, 2025
Look test kicked off at 1 pm.
They tried multiple styles & looks for AlluArjun’s character—from rugged to sleek. Atlee wants to present him in a new avatar ! #AA22 pic.twitter.com/ggscjwk3dT
ముంబైలో లుక్ టెస్ట్
ఆదివారం ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం. బన్నీ పాత్ర కోసం డైరెక్టర్ అట్లీ డిఫరెంట్ లుక్స్ అన్వేషించారట. రగ్గడ్ నుంచి స్టైలిష్ వరకు ఇలా చాలా ట్రై చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ.
అంతేకాదు సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశం కోసం 12 ఏళ్ళ పిల్లలతో ఆడిషన్ కూడా నిర్వహించారట. అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ చివరి వరకు చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా తారాగణానికి సంబంధించిన విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. హై ఎండ్ యాక్షన్, విజువల్స్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందుతున్న చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
telugu-news | cinema-news
Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!