Akhanda 2 Latest Update: బాలయ్య తాండవం షురూ.. 'అఖండ 2' డబ్బింగ్ పూర్తి!

'అఖండ 2: తాండవం' కి సంబంధించి బాలయ్య తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అలాగే డబ్బింగ్ స్టూడియోలో బాలయ్యతో దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు.

New Update

Akhanda 2 Latest Update: బాలయ్య- బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న హై యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం' కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. తాజాగా బాలయ్య తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు(akhanda 2 update). అలాగే డబ్బింగ్ స్టూడియోలో బాలయ్యతో దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు. గతంలో వచ్చిన 'అఖండ' బ్లాక్ బస్టర్  విజయం సాధించడంతో అఖండ2 పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, శక్తివంతమైన లుక్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచాయి. తమన్ బీజీఎంతో మరోసారి థియేటర్లు దద్దరిల్లి పోనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. 

ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడు బ్లాక్‌బస్టర్ హిట్స్ వచ్చాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’. ఇప్పుడు నాలుగోసారి ఇద్దరూ కలవబోతున్నారు. ఈ సినిమా కోసం బోయపాటి మరింత పవర్ఫుల్ స్క్రీన్‌ప్లేతో సిద్ధమయ్యారని తెలుస్తోంది. బాలయ్య ఈసారి కూడా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించే అవకాశం ఉంది.

Also Read: బాలయ్యతో యంగ్ బ్యూటీ ఐటమ్ సాంగ్.. అఖండ నుంచి అదిరిపోయే అప్డేట్!

హిందీ ప్రమోషన్స్ షురూ..

అఖండ ఫస్ట్ పార్ట్ కి తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలకం అవ్వగా, ఈసారి అంతకు మించిన స్థాయి పాటలు , నేపథ్య సంగీతం ఉండనుంది. సినిమా ప్రమోషన్లు మొదలవ్వగానే ఒక్కొక్కటిగా పాటలు విడుదలకానున్నాయి. 'అఖండ 2 తాండవం' ఈసారి తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీగా రిలీజ్ కానుంది. ఇప్పటికే హిందీ ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి.

ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు. అదే రోజున పవన్ కళ్యాణ్ 'OG' కూడా విడుదలవుతోంది. ఒకేరోజు రెండు భారీ సినిమాలు ‘అఖండ 2: తాండవం’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’  విడుదలవుతుండడంతో ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మరోపక్క నిజంగా ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తాయా? అన్న సందేహం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read: బాలయ్య 'అఖండ' లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్! ఇప్పుడు ఎంత అందంగా ఉందో

సెప్టెంబర్ 25న ‘అఖండ 2’ ఫిక్స్..

‘అఖండ 2’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. రీ-రికార్డింగ్, గ్రాఫిక్స్ వర్క్ మొదలైనవి వేగంగా పూర్తవుతున్నాయి. నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనౌన్స్ చేసిన డేట్ కే సినిమాను సెప్టెంబర్ 25న ఖచ్చితంగా విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.

అయితే, ఇండస్ట్రీ విశ్లేషకులు మాత్రం  రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవుతే థియేటర్ల లాభాలు చీలిపోతాయని అంటున్నారు. వీకెండ్ వసూళ్లు విషయంలో రెండు సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.

అయితే, ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటంటే ‘OG’ మూవీ వాయిదా పడే అవకాశాలు చాలా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. 'అఖండ 2' మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్‌పై అఫిషియల్‌గా ముందే అనౌన్స్ చేసేసారు కాబట్టి. ‘OG’ విడుదల కొన్ని వారాల తర్వాతకి షిఫ్ట్ కావచ్చని పలువురు భావిస్తున్నారు.

తాండవం vs ఫైర్ స్ట్రామ్..

ఇక ఈ రెండు సినిమాల మ్యూజిక్ విషయానికి వస్తే ఈ ఇద్దరు మాస్ హీరోల సినిమాలకు కూడా తమన్ సంగీతం అందించడం విశేషం. మొత్తానికి బాలయ్య ‘తాండవం’ చూపించనుంటే, పవన్ ‘ఫైర్ స్ట్రామ్’ చూపించనున్నాడు. మరి ఫైనల్‌గా ఎవరి సినిమా ముందు వస్తుందో చూడాలి. రెండిటిలో ఏ సినిమా ముందు వచ్చినా రికార్డులు బద్దలు కొట్టడం మాత్రం ఖాయం..!

Advertisment
తాజా కథనాలు