నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం'. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'జాజికాయ జాజికాయ' (Jajikaya Jajikaya) లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ 'ది తాండవం'తో భక్తి, పవర్ ఫుల్ బీట్‌ను అందించిన సంగీత దర్శకుడు ఎస్. థమన్.. ఈసారి పూర్తి మాస్ బీట్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు.
Jajikaya Jajikaya Lyrical Video
ఈ 'జాజికాయ జాజికాయ' పాటను విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్ వేదికగా అభిమానుల సమక్షంలో చిత్రబృందం గ్రాండ్‌గా వదిలింది. ఈ సందర్భంగా విడుదలైన లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ ఎనర్జీ, నటి సంయుక్త మీనన్ గ్లామర్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి. సంయుక్తతో బాలయ్య వేసిన మాస్ స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి.
'జాజికాయ జాజికాయ' పాటను కాసర్ల శ్యామ్ పల్లెటూరి నేపథ్యాన్ని, మాస్ ఎనర్జీని మిళితం చేస్తూ సాహిత్యాన్ని అందించారు. బ్రిజేశ్ శాండిల్య, గాయని శ్రేయా ఘోషల్ ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. తమన్ అందించిన ట్యూన్ ఫుట్-ట్యాపింగ్ బీట్‌తో, మాస్ ఆడియెన్స్‌ను థియేటర్లలో డ్యాన్స్ చేసేలా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చింది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సాంగ్, ఈ మాస్ సాంగ్‌తో 'అఖండ 2'పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాలకృష్ణ అఘోరా పాత్రలో మరోసారి కనిపించనున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ అచంట, గోపి అచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాను, మరింత అద్భుతమైన అనుభూతి కోసం 2D తో పాటు 3D ఫార్మాట్‌లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Follow Us