Akhanda 2: అఖండ-2 సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ-2'. ఈ  సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల ధరల పెంపునకు  ఆమోదం తెలిపింది.

New Update
Akhanda

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ-2'. ఈ  సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల ధరల పెంపునకు  ఆమోదం తెలిపింది. ఈ మేరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ప్రత్యేకంగా ప్రీమియర్ షోకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా జీవో (GO) జారీ చేసింది. 

డిసెంబర్ 4వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి లభించింది. సాధారణ టికెట్ ధరలపై కూడా అదనపు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.75 పెంపు, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోతో 'అఖండ-2' చిత్ర నిర్మాతలకు భారీ ఊరట లభించింది. పెంచిన ధరలు, అదనపు షోల అనుమతి డిసెంబర్ 5 నుంచి 10 రోజుల పాటు వర్తించనున్నాయి.

అఖండలో అఘోరాగా

.బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ఇది నాలుగో చిత్రం. వీరి గత మూడు చిత్రాలు (సింహా, లెజెండ్, అఖండ) బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి.అఖండలో అఘోరాగా బాలకృష్ణ పాత్ర సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. అఖండ-2లో కూడా శివ భక్తికి సంబంధించిన అంశాలు, అఘోరా పాత్రను కొనసాగిస్తూనే... మరింత శక్తివంతమైన కోణాన్ని బోయపాటి చూపించారు. 

'అఖండ-2' కూడా విజయవంతమైతే, తెలుగు సినీ చరిత్రలో హీరో-దర్శకుడి కాంబినేషన్‌లో నాలుగు వరుస హిట్‌లు సాధించిన అరుదైన రికార్డు సృష్టించినట్లే అవుతుంది.

Advertisment
తాజా కథనాలు