Ajith Son Aadvik: మోటార్ స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టిన 'కుట్టి తల'..

అజిత్ కుమార్ కుమారుడు ఆద్విక్ (కుట్టి తల) చిన్న వయసులోనే గో-కార్టింగ్ ద్వారా మోటార్ స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టాడు. పిల్లల భవిష్యత్తుపై తానేం ఒత్తిడి చేయనని అజిత్ చెబుతున్నారు. తన భార్య శాలిని సహాయంతోనే తన ప్యాషన్‌ను కొనసాగిస్తున్నానని తెలిపారు.

New Update
Ajith Son Aadvik

Ajith Son Aadvik

Ajith Son Aadvik: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) మోటార్ స్పోర్ట్స్‌పై ఉన్న ఆసక్తి గురించి అందరికీ తెలిసిందే. సినిమాల‌తో పాటు రేసింగ్‌లోనూ త‌న‌కు తానే సాటిగా నిలిచిన అజిత్, ప్రస్తుతం ఆన్ గోయింగ్ రేసింగ్ సీజన్‌లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఒక ఆసక్తికర వ్యాఖ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

Ajith Son Aadvik Motor Racing

అజిత్ కుమార్ తన 10 ఏళ్ల కుమారుడు ఆద్విక్ గురించి చెబుతూ, “తన కొడుకుకి కూడా మోటార్ రేసింగ్ మీద ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడే గో-కార్టింగ్‌తో ప్రారంభించాడు,” అని వెల్లడించారు. అభిమానులు ప్రేమగా 'కుట్టి తల' అని పిలిచే ఆద్విక్ కూడా తన తండ్రి మార్గంలో అడుగులు వేస్తున్నాడన్న విషయం అభిమానులను ఆనందంతో ముంచెత్తుతోంది.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

అయితే, తన పిల్లల భవిష్యత్తుపై తన అభిప్రాయాలను ఒత్తిడి చేయనని అజిత్ స్పష్టం చేశారు. "వాళ్లకు ఏం చేయాలో ఆలోచన వాళ్లలోనుండే రావాలి. అది సినిమా అయినా, రేసింగ్ అయినా నేను నిర్ణయించను," అని చెప్పారు. 

Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్

అలాగే, తన జీవిత భాగస్వామి శాలిని గురించి మాట్లాడుతూ, ఆమె తన మోటార్ స్పోర్ట్స్ ప్యాషన్‌ను ఎప్పటి నుంచో ప్రోత్సహించిందని తెలిపారు. “మనసుకు నచ్చిన దాన్ని చేయాలంటే కొన్ని త్యాగాలు అవసరం. పిల్లల్ని దూరంగా వదిలి పోవడం కష్టం అయినా, మన కలల్ని సాధించాలంటే కొంత త్యాగం తప్పదు,” అని అన్నారు.

Also Read: అక్కడ రికార్డు బ్రేక్.. దుమ్ము రేపుతోన్న 'మిరాయ్' కలెక్షన్స్

తన పిల్లలపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిన అజిత్, ఒక తండ్రిగా, ఒక వ్యక్తిగా ఎంతో బాధ్యతగా జీవిస్తున్నారు అని తెలుస్తోంది. చిన్న వయసులోనే ఆద్విక్ మోటార్ స్పోర్ట్స్‌ను ఆసక్తిగా నేర్చుకోవడం చూస్తుంటే, భవిష్యత్తులో 'కుట్టి తల' కూడా తండ్రి తరహాలో పెద్ద రేసర్‌గా ఎదిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisment
తాజా కథనాలు