/rtv/media/media_files/2025/02/28/xIdjyCbaL0rpZJBdOkeK.jpg)
anurag Kashyap as cop in decoit
Dacoit Movie: అడివిశేష్- మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డెకాయిట్'. షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్థూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు షానెల్ గతంలో క్షణం, గూఢచారి వంటి చిత్రాలకు DOP గా పనిచేశారు. తాను డైరెక్టర్ గా రాబోతున్న తొలి సినిమా ఇది. ఇప్పటికే 'డెకాయిట్' నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్.
Also Read:రజినీకాంత్ స్పెషల్ సాంగ్ కోసం పూజ భారీ రెమ్యునరేషన్.. ఏకంగా ఒక సినిమాకు ఛార్జ్ చేసేంత
Deeksha lo unna Police Nannu pattukuntadu ata..
— Adivi Sesh (@AdiviSesh) February 28, 2025
Nannu pattukovalante aa Devude Digi ravali emo 💥
Delighted to have the Amazing @anuragkashyap72 sir in #DACOIT.@mrunal0801@Deonidas#BheemsCeciroleo@danushbhaskar@abburiravi@KrishSiddipalli@srinagendrapd@KalyanKodati… pic.twitter.com/y33VA50QYv
పోలీస్ గా అనురాగ్
ఇందులో స్టార్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. 'స్వామి' అనే పవర్ ఫుల్ పోలీస్ గా అనురాగ్ కనిపించనున్నారు. ''దీక్షలో ఉన్న పోలీస్ నన్ను పట్టుకుంటాడట.. నన్ను పట్టుకోవాలంటే ఆ దేవుడే దిగి రావాలేమో అంటూ అనురాగ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. 'డెకాయిట్' తెలుగు, హిందీ రెండు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోల్ సంగీతం అందిస్తున్నారు. శేష్ మిస్టరీ, యాక్షన్, థ్రిల్లర్ వంటి ఆసక్తికరమైన జానర్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకెళ్తున్నాడు. రీసెంట్ గా మేజర్, హిట్2 సినిమాలతో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా