/rtv/media/media_files/2025/11/10/trisha-2025-11-10-15-47-51.jpg)
trisha
Trisha: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కు మరో సారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. చెన్నై ఆళ్వార్పేట్ లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు త్రిష ఇంటికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో పోలీసులు దీనిని ఒక ఫేక్ బెదిరింపుగా తేల్చారు. త్రిష ఇంటికి ఇలా బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి! ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు మెయిల్ చేసిన వ్యక్తుల కాల్ లొకేషన్లు, టెక్నికల్ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇది కేవలం ఆకతాయిల పనా? లేదా దీని వెనుక ఏదైన వ్యక్తిగత కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
திரிஷா வீட்டிற்கு 4ம் முறையாக..
— Thanthi TV (@ThanthiTV) November 10, 2025
ஆழ்வார்பேட்டையில் உள்ள நடிகை திரிஷா வீட்டிற்கு 4வது முறையாக வெடிகுண்டு மிரட்டல்
வெடிகுண்டு வைத்திருப்பதாக டிஜிபி அலுவலகத்திற்கு அனுப்பப்பட்ட மின்னஞ்சல் வந்த நிலையில் வெடிகுண்டு நிபுணர்கள் மோப்ப நாய் உதவியுடன் நடத்திய சோதனையில் புரளி என தகவல்… pic.twitter.com/Cmsb3wkU4E
వరుసగా బెదిరింపులు
త్రిషకు మాత్రమే కాదు గత కొన్ని రోజులుగా తమిళనాడులో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్, ఇతర సినీ ప్రముఖులైన రజనీకాంత్, విజయ్, నయనతార వంటి ప్రముఖుల ఇళ్లకు వరుసగా ఇలాంటి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీనికి వెనుక కారణం ఏంటి? అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రముఖుల ఇళ్లకు వరుసగా బాంబ్ బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనలను సీరియస్ గా తీసుకుంది. ప్రముఖుల నివాస ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసింది. భవిష్యత్తులో నిజమైన ప్రమాదాలు జరిగితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే.. 40 ఏళ్ళ వయసులోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ సరసన 'విశ్వంభర', తమిళ్లో సూర్య జోడీగా 'కరుప్పు', మలయాళంలో మోహన్ లాల్ 'రామ్' సినిమాలో నటిస్తోంది. 'స్టాలిన్' తర్వాత దాదాపు 18 ఏళ్లకు 'విశ్వంభర' సినిమాతో మళ్ళీ త్రిష- మెగాస్టార్ జోడీ తెరపై కనిపిస్తుండడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
Also Read: Raja Saab Songs: సాంగ్ రూమర్స్ పై స్పందించిన 'రాజాసాబ్' టీమ్.. ఫస్ట్ సింగిల్ ఆన్ ది వే!!
Follow Us