Actress Rajitha : సీనియర్ నటి రజిత ఇంట తీవ్ర విషాదం

టాలీవుడ్ సినీయర్ నటి రజిత ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 76సంవత్సరాలు.  ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

New Update
rajitha actress

టాలీవుడ్ సినీయర్ నటి రజిత ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 76సంవత్సరాలు.  ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు  కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మీకి చెల్లెళ్లు అవుతారు. ఇక రజిత 1986నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు.  తెలుగులో ఆమె 200 కి పైగా చిత్రాల్లో నటించారు. శనివారం (మార్చి 22న) ఉదయం 11 గంటలకు ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో విజయలక్ష్మి అంత్యక్రియలు జరగనున్నాయి. 


విజయలక్ష్మి భర్త మల్లెల రామారావు వీరిది స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, కొల్ల. తండ్రి రజిత చిన్నతనంలో ఉండగానే చనిపోయారు. తల్లే ఆమెను శ్రద్ధగా చదివించింది. ఆమె బాగా చదువుకుని డాక్టరు కావాలని అనుకునేది. రజితకు ఇద్దరు అక్కలు ఉన్నారు. పదో తరగతి దాకా కాకినాడలో చదివింది. ఇంటర్మీడియట్ చెన్నై లో చదివింది. రజిత పుస్తకాలు బాగా చదువుతుంది.  రజిత పెళ్ళి చేసుకోలేదు. తల్లితో కలిసి ఉంటున్నారు.

 నాగేశ్వరరావు కూతురుగా

1987లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్నిపుత్రుడు రజిత మొదటి సినిమా. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే చెన్నైలో ఉన్న పిన్ని కృష్ణవేణి దగ్గరికి వెళ్ళింది. నాగార్జున హీరోగా అగ్నిపుత్రుడు సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సమయంలో పరుచూరి గోపాలకృష్ణ రజితను చూసి రాఘవేంద్రరావుకు పరిచయం చేశారు. ఆయన ఆమెను ఆ సినిమాలో నాగేశ్వరరావు కూతురుగా నటించమన్నారు. సినిమాల మీద ఆసక్తిలేక మొదట్లో వద్దని చెప్పినా పిన్ని కృష్ణవేణి నచ్చచెప్పటంతో అందుకు అంగీకరించింది. తరువాత ఆమెకు వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. 

Also read:  తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట.. కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు