Poonam Kaur: వాడు మాస్టర్ కాదు, కీచకుడు.. జానీ పై పూనమ్ ఫైర్..!

జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నిందితుడైన షేక్ జానీని ఇక పై ''మాస్టర్'' అని పిలవాల్సిన అవసరం లేదు. మాస్టర్ అనే పదానికి విలువ ఉంచాలి అని ట్వీట్ చేసింది.

author-image
By Archana
New Update
poonam kaur

poonam kaur

Johnny Master: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దగ్గర పనిచేసే మహిళా జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు పెట్టింది. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం FIR ఫైల్ చేసిన పోలీసులు జానీ పై  IPC 376, 323, 506 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ మరి కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జానీ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు తెలిపింది. భర్త కోరిక తీర్చకపోతే తనపై దాడి చేసేదని.. భార్య భర్తలు ఇద్దరు ఇంటికి వచ్చి కూడా వేధించేవారని చెప్పింది. 

పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ 

ఇది ఇలా ఉంటే జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. నిందితుడైన షేక్ జానీని ఇక పై ''మాస్టర్'' అని  పిలవాల్సిన అవసరం లేదు. మాస్టర్ అనే పదానికి విలువ ఉంచాలి అని ట్వీట్ చేసింది. 

Advertisment
తాజా కథనాలు