Pooja Hegde: పూజా హెగ్డే సరికొత్త రేంజ్ రోవర్.. ధర తెలిస్తే మతిపోవాల్సిందే! నటి పూజా హెగ్డే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల తన బర్త్‌డేను ఘనంగా జరుపుకుంది. ఇందులో భాగంగానే ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. దీని ధర రూ.2.36 కోట్ల నుంచి రూ.4.98 కోట్ల వరకు ఉంటుంది. By Seetha Ram 28 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ టాల్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాలు బ్రేక్ ఇచ్చింది. టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది. ఇక అక్కడ కూడా రెండు మూడు సినిమాలు చేసింది. కానీ అవి కూడా పెద్దగా హిట్ కాలేకపోయాయి. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ఇది కూడా చూడండి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్! రేంజ్ రోవర్ కొనుగోలు చేసిన బుట్టబొమ్మ ఈ మేరకు బర్త్ డే సందర్భంగా విలాసవంతమైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర సుమారు రూ.2.36 కోట్ల నుంచి రూ.4.98 కోట్ల మధ్యలో ఉంటుంది. అయితే పూజా ఏ వేరియంట్‌ను కొనుగోలు చేసిందో ఇంకా తెలియలేదు. కాగా కారు కొనుగోలు చేసిన సమయంలో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది కూడా చూడండి: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు.. స్పెసిఫికేషన్స్ ఇదిలా ఉంటే ఈ కారు స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్, పవర్‌ట్రైన్ సహా ఇతర వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ రేంజ్ రోవర్ కారు భారత మార్కెట్‌లో మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో SE, HSE, ఆటోబయోగ్రఫీ, ఫస్ట్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. కాగా ఈ కారు మూడు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. దీంతోపాటు రేంజ్ రోవర్‌లో 2-వీల్‌బేస్ మోడల్‌లు ఉన్నాయి. ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా.. కాగా ఈ రేంజ్ రోవర్ SUV 13.1 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 13.7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది. ఇందులో అధునాతన ఫీచర్లు సైతం ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, 3డి సరౌండ్ కెమెరా సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య ఇందులో 3.3 లీటర్, 6 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఇది 400 hp పవర్, 550 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో 3.0 లీటర్, 6 సిలిండర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 350 hp పవర్, 700 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఇందులో హై రేంజ్ వేరియంట్ 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 530 hp పవర్, 750 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. #tollywood #pooja-hegde #range-rover మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి