ఆ బిజినెస్ లోకి రామ్ చరణ్ హీరోయిన్ .. రెండు చేతులా సంపాదన

'చిరుత' హీరోయిన్ నేహా శర్మ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఢిల్లీలోని వసంత విహార్‌లో 'కాల్ మీ టెన్' పేరు జపనీస్ రెస్టారెంట్‍ ప్రారంభించింది. ఇది కనుక సక్సెస్ అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాలు, రెస్టారెంట్ బిజినెస్ తో రెండు చేతులా సంపాదించడం గ్యారెంటీ.

neha sharma
New Update

Actress Neha Sharma : 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి'.. ఈ సామెతను మన సినీ సెలెబ్రిటీలు బాగా ఫాలో అవుతున్నారు. సినిమాలతో ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటున్నా అక్కడితో ఆగాకుండా.. ఇతర రంగాల్లోనూ భారీ పెట్టుబడులు పెట్టి బాగానే సంపాదిస్తున్నారు. స్టార్ హీరోలే కాదు హీరోయిన్స్ సైతం సినిమాలు, ఇతర బిజినెస్ లు స్టార్ట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు.

తాజాగా 'చిరుత' మూవీ హీరోయిన్ నేహా శర్మ సైతం ఓ కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిహార్‌కి చెందిన ఈమె.. రామ్ చరణ్ తొలి సినిమా 'చిరుత'తో హీరోయిన్ అయింది. తెలుగులో 'కుర్రాడు' అని మరో మూవీ చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. రీసెంట్ గా 'బ్యాడ్ న్యూజ్' మూవీలో కనిపించిన ఈ బ్యూటీ తాజాగా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. 

Also Read : ఊహించని ఎలిమినేషన్..! నైనిక, సీత అవుట్..!

జపనీస్ రెస్టారెంట్..

ఢిల్లీలోని వసంత విహార్‌లో 'కాల్ మీ టెన్' పేరు జపనీస్ రెస్టారెంట్‍ ప్రారంభించింది. ఇది కనుక సక్సెస్ అయితే ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు, మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ తో రెండు చేతులా సంపాదించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి ఈ హీరోయిన్ కు రెస్టారెంట్ బిజినెస్ కలిసొస్తుందా? లేదా? అనేది చూడాలి. 

#neha-sharma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe