BIGG BOSS 8: ఊహించని ఎలిమినేషన్..! నైనిక, సీత అవుట్..! బిగ్ బాస్ సీజన్ సీజన్ 8లో మూడవ వారం వచ్చేసింది. ఇక వీకెండ్ బిగ్ బాస్ ఇంటికి వదిలి వెళ్లబోయే కంటెస్టెంట్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా సీత లేదా నైనిక ఎలిమినేట్ కావచ్చనే టాక్ వినిపిస్తోంది. By Archana 22 Sep 2024 in సినిమా Short News New Update BIGG BOSS 8 షేర్ చేయండి బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్ లెస్ ఫన్, లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్ తో ఆసక్తికరంగా సాగుతోంది. గత వారం ప్రేక్షకులు ఊహించని విధంగా శేఖర్ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇంటికి భాయ్ చెప్పబోయే కంటెస్టెంట్ ఎవరా..? అని ప్రేక్షకులు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం పృథ్వీ, సీత, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, అభయ్ నవీన్, నాగ మణికంఠ, నైనిక నామినేషన్స్ లో ఉన్నారు. పృథ్వీ లేదా అభయ్ ఎలిమినేటెడ్..? ఆల్ లైన ఓటింగ్ పోల్స్, అలాగే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం పృథ్వీ లేదా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారం టాస్కుల్లో బిగ్ బాస్ పట్ల అభయ్ ప్రవర్తించిన తీరు, ఆమర్యాద లేకుండా బిగ్ బాస్ ను తిట్టడం అతనికి చాలా నెగెటివ్ అయ్యాయి. అంతే కాదు నిన్న వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున అతనికి రెడ్ కార్డు కూడా ఇచ్చారు. వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపొమ్మని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి తోడు క్లాన్ చీఫ్ గా అభయ్ అట్టర్ ఫ్లాప్ అయినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ కారణాలన్ని అభయ్ వోటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ వారం అభయ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక పృథ్వీ విషయానికి వస్తే.. తాను టాస్క్ బాగా ఆడినప్పటికీ.. కావాల్సిన కంటే ఎక్కువ అగ్రెస్సివ్ గా ఆడినట్లు ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. అంతే కాదు మధ్య మధ్యలో బ్యాడ్ లాంగ్వేజ్ వాడడం కూడా చేశారు. దీని వల్ల పృథ్వీ ఓటింగ్ పై వోటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని టాక్. ఊహించని విధంగా సీత, నైనికా ఒకవేళ పృథ్వీ, అభయ్ ఎలిమినేట్ కాకపోతే ఊహించని విధంగా సీత, నైనిక ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవచ్చని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వారం సీత, నైనిక ఆట విషయానికి వస్తే.. సీత బాగానే ఆడినప్పటికీ.. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినట్లు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక నైనిక అయితే ఈ వారం చాలా తక్కువగా కనిపించింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి