సింపుల్ స్టెప్పులే అయినా స్టైలిష్‌గా ..
ఇటీవల విడుదలైన సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా వెట్టియాన్‌లో స్టెప్పులతో అదరగొట్టిన ముద్దుగుమ్మ అందరి దృష్టిలో పడింది. సింపుల్ స్టెప్పులే అయినా స్టైలిష్‌గా వేసి మార్కులు కొట్టేసింది. సినిమా విజయం విషయం పక్కనపెడితే అందరి చూపూ మంజు వారియర్వైపే అని చెప్పాలి.
అభిమానుల్లో మంచి ఆదరణ
నటి మంజు వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. ఆ తర్వాత అసురన్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ అభిమానుల్లో సైతం ఆమెకు మంచి ఆదరణ ఉంది.
సినిమాలకు దూరంగా..
చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 46 ఏళ్ల వయసులోనూ తగ్గేదే అంటోంది. వెట్టియాన్ సినిమాలో దాదాపు మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. వయసు శరీరానికే కాని మనసుకు కాదని చెబుతోంది వారియర్.
చర్మ సంరక్షణే కారణం
నటి మంజు వారియర్ ఈ వయసులో కూడా ఇంత అందంగా కనిపించడానికి కారణం ఆమె చర్మ సంరక్షణే. ఫోమ్ క్లెన్సర్ ఉపయోగించి ప్రతిరోజు ఫేస్ క్లీన్ చేస్తుంది. రోజుకు కనీసం 3-4 సార్లు ముఖం కడుతానని చెబుతోంది.
మృతకణాలను తొలగించడానికి వారానికి కనీసం 1-2 సార్లు మంచి సున్నితమైన స్క్రబ్‌తో ఎక్స్ఫోలియేట్ చేయడం ఉత్తమమని మంజు వారియర్ అంటున్నారు. హైపర్‌పిగ్మెంటేషన్‌తో సహా అనేక చర్మ సమస్యలకు సన్‌స్క్రీన్ పరిష్కారమని, సన్‌స్క్రీన్ రాసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లనని అంటోంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరం
రోజంతా నీరు బాగా తాగుతానని, కార్బోనేటేడ్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటానని, కూరగాయలు తీసుకుంటానని చెబుతోంది మంజు వారియర్.