నటి కస్తూరికి బిగ్ షాక్.. సెంట్రల్ జైలుకు తరలింపు

నటి కస్తూరిని పోలీసులు నిన్న (శనివారం) అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎగ్మోర్ కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇందులో భాగంగానే న్యాయమూర్తి ఈనెల 29వరకు రిమాండ్‌ విధించారు. దీంతో నటి కస్తూరిని చెన్నైలోని పుళల్ సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు. 

New Update

ప్రముఖ నటి కస్తూరిని పోలీసులు నిన్న (శనివారం) అరెస్ట్ చేశారు. తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు ఆమెను పట్టుకున్నారు. 

Also Read :  రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?

ఈ మేరకు ఆమెను కోర్టులో హాజరుపరచగా.. ఎగ్మోర్ కోర్టు కస్తూరికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇందులో భాగంగానే న్యాయమూర్తి ఈనెల 29వరకు రిమాండ్‌ విధించారు. దీంతో నటి కస్తూరిని చెన్నైలోని పుళల్ సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు. 

ఏం జరిగింది?

Also Read :  మాట తప్పి చేతులెత్తేసిన రేవంత్.. మహారాష్ట్ర ప్రచారంలో పవర్ స్టార్ పంచులు!

ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. 300 ఏళ్ల క్రితం రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమిళులం అంటూ చెప్పుకుని తిరుగుతున్నారని అన్నారు. అదే సమయంలో ఎప్పుడో ఇక్కడకి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read :  నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు వైరల్.. ఇంత సింపుల్‌గా ఉందేంటి..!

ఇతరుల భార్యలపై మోజు పడవద్దని.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెప్పడం వల్లనే తమిళ నాట వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది అని తీవ్ర విమర్శలు చేసింది. ఆ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున విమర్శలు సైతం వెల్లువెత్తాయి.

Also Read :  నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

ఇక తన వ్యాఖ్యలపై కస్తూరి క్షమాపణలు చెప్పినప్పటికీ పలు చోట్ల ఆమెపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేయగా.. ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు నిరాకరించడంతో నేడు పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు