/rtv/media/media_files/2025/04/16/G3eCGiXrpix1MxPZRNsE.jpg)
jayasudha
గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నటి జయసుధ వ్యవహరించనున్నారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జ్యూరీ తాజాగా ఎఫ్డీసీ లో సమావేశం అయింది. గద్దర్ అవార్డుల ఎంపిక విషయంలో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులను ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినిమా అవార్డులను ఇస్తున్నట్టుగా వారికి గుర్తుచేసిన దిల్ రాజు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదన్నారు.
1,248 nominations received for Gaddar Awards
— Congress for Telangana (@Congress4TS) April 16, 2025
సినీనటి జయసుధ చైర్మన్గా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం
🔸వ్యక్తిగత కేటగిరిలో 1,172 నామినేషన్స్.
🔸చలనచిత్రాలు, డాక్యుమెంటరీ, పుస్తకాలు తదితర కేటగిరీలలో 76 నామినేషన్స్.
🔸ఈ నెల 21 నుంచి స్ర్కీనింగ్ చేయనున్న… pic.twitter.com/IqCcup5ahC
1248 విభాగాల్లో నామినేషన్స్
గద్దర్ అవార్డుల కోసం ఇప్పటివరకు 1248 విభాగాల్లో నామినేషన్స్ రాగా.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఏప్రిల్ 21వ తేదీ నుంచి జ్యూరీ సభ్యులు స్ర్కీనింగ్ చేయనున్నారు. కాగా తెలుగు సినిమా రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. జ్యూరీ తమ బాధ్యతను గౌరవంతో మరియు నిజాయితీగా నిర్వర్తిస్తుందని జయసుధ భరోసా ఇచ్చారు.