/rtv/media/media_files/2025/01/21/iUpDLMe5u40ovE1SwMJ8.jpg)
jailer actor Photograph: (jailer actor )
మలయాళ నటుడు వినాయకన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. పొరుగువారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వినాయకన్ పుల్ గా తాగి బాల్కనీలో లుంగీ కట్టుకుని పొరుగువారిని అసభ్యకరమైన మాటలతో దూషిస్తూ కనిపించారు. చివరికి సరిగ్గా నిలబడ లేక బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
పొరుగువారిపై అరుస్తూ, దూషిస్తున్న వీడియో వైరల్ గా మారడంతో అతనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. నటుడు వినాయకన్ ఇలా వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల విమానాశ్రయ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఎయిర్‌పోర్ట్ ఫ్లోర్‌లో చొక్కా లేకుండా కూర్చుని ఇండిగో గేట్ సిబ్బందిపై అరుస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Also Read : USA: ట్రంప్ మొదట సంతకాలు చేసిన పది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవే..
Actor #Vinayakan shouting & abusing with his Neighbor 🤥
— DJ 𝕏 (@urstrulyDJX) January 20, 2025
⚠️⚠️ pic.twitter.com/DN9aNTRo0R
ఈ ఘటనతో ఎయిర్‌పోర్టులోని సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అలాగే భార్యతో ఇంట్లో గొడవలు పడటంతో ఇప్పటికే అతడిపై పోలీసు కేసు నమోదైంది.
వినాయకన్ మలయాళం, తమిళ చిత్రాలలో చాలా ఫేమస్ యాక్టర్.. రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో వర్మన్‌గా కనిపించి మెప్పించాడు. ఈ సినిమాతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లింది. కానీ ఇలా తరుచూ వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలవడంతో వినాయకన్ ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు మొదలవుతున్నాయి. నటుడుగా ఎంత పేరు సంపాదించుకున్న వినాయకన్.. ఇలా మద్యం తాగి ఇలాంటి పనులు చేయడంతో ఆ పేరు అంతా కూడా పోగొట్టుకుంటున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Amit Shah : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన ట్వీట్