Shiva Rajkumar: కన్నడ నటుడు శివరాజ్ కుమార్ క్యాన్సర్ ను జయించారు. గత కొన్నాళ్లుగా అమెరికాలోని ఫ్లోరిడాలో మియామీ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. చికిత్స చివరి దశకు చేరుకుందని.. త్వరలో అభిమానుల ముందుకు వస్తానని తెలియజేస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ, ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿ
— DrShivaRajkumar (@NimmaShivanna) January 1, 2025
ಹೊಸ ವರ್ಷದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು! #2025 pic.twitter.com/4oyg2uXfjg
వారందరికీ ధన్యవాదాలు
శివరాజ్ కుమార్ ఇంకా మాట్లాడుతూ. క్యాన్సర్ సోకిందని తెలిసిన వెంటనే భయం వెంటాడుతుంది. ఆ భయాన్ని దూరం చేసేందుకు నా భార్య గీత, నా అభిమానులు ఎంతో సహకరించారు. వారందరికీ రుణపడి ఉంటాను. నేను పూర్తి చేయాల్సిన సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను.. ఓ వైపు కీమో థెరపీ చేయించుకుంటూనే '45' మూవీ షూటింగ్ చేశాను. ఈ సమయంలో వైద్యులు అందించిన సహకారం మరువలేనిది అని తెలిపారు. అనంతరం శివరాజ్ కుమార్ భార్య గీత మాట్లాడుతూ.. నా భర్త క్యాన్సర్ ని జయించారు. మాకు ఇది ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే అభిమానులకు కూడా ఇది తీపి కబురు.. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తాము అని అన్నారు.
Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ !