Govinda : బాలీవుడ్ నటుడు గోవిందాకు అస్వస్థత

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తన నివాసంలో ఆయన స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబైలోని జుహులో గల క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు.

New Update
govinda

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తన నివాసంలో ఆయన స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబైలోని జుహులో గల క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. గోవిందా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన స్నేహితుడు లలిత్ బిందాల్ తెలిపారు. అస్వస్థతకు గల కారణాన్ని తెలుసుకునేందుకు వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ నివేదికలు రావాల్సి ఉంది.

అభిమానులు త్వరగా కోలుకోవాలని

61 ఏళ్ల గోవిందా ఆసుపత్రిలో చేరారనే వార్త తెలిసి ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా గత ఏడాది, అక్టోబర్‌లో కూడా గోవిందాకు ఇదే ఆసుపత్రిలో చికిత్స అందించారు. తన లైసెన్స్‌డ్ రివాల్వర్ మిస్‌ఫైర్ కావడంతో ఆయన కాలికి బుల్లెట్ గాయమైంది. రివాల్వర్‌ను అల్మారాలో పెడుతుండగా అది కిందపడి పేలడంతో గోవిందా మోకాలి కింద గాయమైంది. వెంటనే ఆయన్ను జుహులోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక గంట పాటు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. ఆ సమయంలో ఆయన్ను ఐసీయూలో ఉంచారు. 

Advertisment
తాజా కథనాలు