Baby Movie: డైరెక్టర్ సాయి రాజేష్ తెలుగులో 'బేబీ' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. ప్రజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ కథాంశంతో బాక్స్ ఆఫీస్ వద్ద కల్ట్ హిట్ గా నిలిచింది. దీంతో డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో బాలీవుడ్ యంగ్ యాక్టర్ బాబిల్ ఖాన్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా నటుడు బాబిల్ ఖాన్ సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేశారు.
తప్పుకున్న హీరో..
బేబీ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ''ఎంతో గౌరవం, అభిరుచితో మేమిద్దరం కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా సినిమా ముందుకు సాగలేదు. ప్రస్తుతం నేను కొంత సమయం బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను'' అని తెలిపారు. అలాగే సాయి రాజేష్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ''మా మధ్య ఉన్న ప్రేమను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. భవిష్యత్తులో మేము తప్పకుండా మళ్లీ కలుసుకుంటాం.. ఆ మ్యాజిక్ సృష్టిస్తాం'' అంటూ పోస్ట్ పెట్టారు.
telugu-news | latest-news | cinema-news | baby hindi remake | Actor Babil Khan