/rtv/media/media_files/2025/04/28/zlMYjuPsMVnsRue4zRfA.jpg)
AjithKumar- Padma Bhushan
Actor Ajith: హీరో అజిత్ కాలికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పద్మ భూషణ్ తీసుకున్న వేళా అందరూ సంతోషంగా ఉండగా.. ఇలా జరగడం కుటుంబ సభ్యులు, అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి.
అయితే పద్మ భూషణ్ స్వీకరించిన తర్వాత మంగళవారం రాత్రి అజిత్ ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీంతో అభిమానులు ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఎయిర్‌పోర్టులో అందరు ఆయన చుట్టూ గుమికూడటంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయన కాలికి గాయమైంది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన ప్రమాదమేమీ కాదని వైద్యులు స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం వరకు డిశ్చార్జ్ అవకాశం ఉన్నట్లు అజిత్ టీమ్ వెల్లడించింది.
Not sure if #Ajith sir got injured here. We all should be careful with us and with others. Glad nothing serious. pic.twitter.com/8cL1bYve1s
— Ashok Surya (@AshokSuryaOff03) April 30, 2025
గతంలోనూ..
ఇదిలా ఉంటే రేసింగ్ చేస్తుండగా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. కానీ, అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఓ సారి దుబాయ్ లో జరిగిన గ్రాండ్ ఫినాలే రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా...అజిత్ కారు గోడను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత స్పెయిన్ లో జరిగిన మరో రేస్ లో పక్కనే వస్తున్న కారును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కూడా అదృష్టవశాత్తు అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన టీమ్ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఇందులో అజిత్ తప్పేమీలేదని.. ఇతర కారు వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు.
actor-ajith | cinema-news | telugu-news
Also Read: Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!