'ఆచార్య' లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ.. జూనియర్ ఎన్టీఆర్ తో 'దేవర' సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల చేసిన కామెంట్ నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఆ కామెంట్ చిరంజీవిని ఉద్దేశించి చేసాడని నెట్టింట టాక్ నడించింది. అయితే దీనిపై కొరటాల శివ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
కొరటాల ఏమన్నారటంటే..
దేవర ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో కొరటాల శివ.. ఎవరు చేయాల్సిన పని వారు భయంతో, అటెన్షన్‌తో చేస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ పక్కవాళ్లు చేస్తున్న పనిలో వేలు పెట్టి.. వాళ్ల పని వాళ్లు చేసుకోనివ్వకపోతేనే నష్టం అంటూ చెప్పారు. యితే కొరటాల కామెంట్స్ ఆచార్య సినిమానుద్దేశించినవేనని.. పరోక్షంగా చిరంజీవి ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరిగింది.
తప్పుగా అర్థం చేసుకున్నారు..
ఆయన చేసిన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని కొరటాల శివ తాజాగా ఓ చిట్ చాట్ లో ఈ ఇష్యుపై క్లారిటీ ఇచ్చారు." ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత మానసికంగా కృంగిపోయాను. నువ్వు ఖచ్చితంగా మంచి కమ్‌బ్యాక్ ఇస్తావ్ శివ అని నాకు మొట్టమొదటిసారి మెసేజ్ చేసింది చిరంజీవి. ఆచార్య ఈవెంట్ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక్క సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచినంత మాత్రాన మా మధ్య పగలు, ప్రతీకారాల్లాంటివి ఏమీ లేవు. అదంతా బయటివాళ్లు సృష్టించుకున్నదే" అని చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ తో అనుకోని చిరుతో..
నిజానికి కొరటాల శివ 'ఆచార్య' సినిమాను రామ్ చరణ్‌తో తీయాలని అనుకున్నాడు. అయితే సినిమా మొదలయ్యే సమయానికి చరణ్ తో కాకుండా తనతో చేయాలని కొరటాలను తానే కోరినట్టు చిరంజీవి ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో కొరటాల శివ..' చిరంజీవి ఎలా చెబితే అలా చేశానని ఈ సినిమాకు ఆయనే అసలు డైరెక్టర్' అని అన్నాడు. దీంతో ముందుగా నవ్విన చిరంజీవి..సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మాత్రం అది డైరెక్టర్ ఛాయిస్. ఆయన ఏం చెబితే అదే చేశానని కామెంట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.