Aamir Khan Mahabharata: 'మహాభారతం' ప్రాజెక్ట్ పై ఆమిర్ ఖాన్ కీలక "అప్‌డేట్

ఆమిర్ ఖాన్ 30 ఏళ్లుగా కలలుగంటున్న మహాభారతం ప్రాజెక్ట్ పై పనులు మొదలయ్యాయి. ఇది యజ్ఞంలా భావించి చేస్తానని చెబుతూ, వచ్చే రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు మొదలవుతాయని తెలిపారు. సిరీస్‌గా తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌కు ఇండస్ట్రీ టాప్ టెక్నికల్ టీం పని చేయనుంది.

New Update
Aamir Khan Mahabharata

Aamir Khan Mahabharata

Aamir Khan Mahabharata:

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు తన కలల ప్రాజెక్ట్‌ అయిన ‘మహాభారతం’ పై పూర్తి దృష్టి పెట్టాడు. ఈ ఇతిహాస ప్రాజెక్ట్‌ను తాను ఒక సాధారణ సినిమాలా కాకుండా, ఒక యజ్ఞంలా రూపొందించాలని ఆశపడుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమిర్‌ ఖాన్ ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

ఆమిర్ మాట్లాడుతూ, “మహాభారతం కోసం నేను దాదాపు 30 ఏళ్లుగా కలలు కనుతున్నాను. ఇది నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇప్పటికే పలు దశల్లో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వచ్చే రెండు నెలల్లో స్క్రిప్ట్ వర్క్‌ మొదలవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం అందరూ  సిద్ధంగా ఉండాలి. ఇది సినిమా కాదు ఒక ఆధ్యాత్మిక యజ్ఞంలా భావించి చేస్తున్నాను” అని చెప్పారు.

Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్‌ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్

అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌ను ఒకే భాగంగా కాకుండా సిరీస్‌ల రూపంలో రూపొందించనున్నట్టు స్పష్టంచేశారు. ఎందుకంటే మహాభారతం కేవలం కొన్ని గంటల్లో చెప్పే కథ కాదు. దీని వెనక ఉన్న భావాలు, పాత్రల లోతు, సంక్లిష్టత అన్నీ కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా రూపొందించాలి అంటున్నారు ఆమిర్.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటివరకు కథ మీదే పని జరుగుతోంది. కథ పూర్తి అయిన తరువాతే నటీనటుల ఎంపిక మొదలవుతుందని ఆయన చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన అనేక మంది టాలెంటెడ్ డైరెక్టర్లు, రచయితలు ఈ ప్రాజెక్ట్ పై కలిసి పని చేయనున్నారని చెప్పారు.

Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?

ఇక ప్రస్తుతం ఆమిర్ ఖాన్ "లాహోర్: 1947" అనే చిత్రానికి సైన్ చేశారు. ఈ సినిమా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనుండగా, సన్నీ డియోల్ ఇందులో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. గతంలో "సితారే జమీన్ పర్", "కూలీ" సినిమాలతో మంచి ఆదరణ పొందిన ఆమిర్, మహాభారతం ప్రాజెక్ట్‌తో మరోసారి తన సత్తా నిరూపించడానికి సిద్ధమవుతున్నాడు.

ఆమిర్ ఖాన్ 30 ఏళ్లుగా కలలుగంటున్న మహాభారతం ప్రాజెక్ట్ పై పనులు మొదలయ్యాయి. ఇది సినిమా కాదని, యజ్ఞంలా భావించి చేస్తానని చెబుతూ, వచ్చే రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు మొదలవుతాయని తెలిపారు. సిరీస్‌గా తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌కు ఇండస్ట్రీ టాప్ టెక్నికల్ టీం పని చేయనుంది.

Advertisment
తాజా కథనాలు