/rtv/media/media_files/2025/04/23/UYiIOjVv7ECMSVIspukw.jpg)
Aamir Khan
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం 'సితార్ జమీన్ పర్' సినిమాతో బిజీగా ఉన్నారు. తరచూ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కొత్త అప్డేట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చాలాకాలంగా అమీర్ ఖాన్ అతిగొప్ప ఇతిహాసమైన 'మహాభారతాన్ని' వెండితెర పై చూపించాలని ప్రయత్నిస్తున్నారు.
'మహాభారతం' నా కల
ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నేటి తరానికి మహాభరతాన్ని అందించాలనేది తన కల అని చెప్పారు . ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీని స్క్రిప్టింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుందని.. ఒకే సినిమాలో స్టోరీ అంతా చూపించలేమని అన్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' తరహాలో సీరీస్ లుగా అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎంతోమంది డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక చేస్తాము. అమీర్ ఈ చిత్రంలో నటిస్తాడా లేదా? అని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.
1000 కోట్ల..
అమీర్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం 2018లో రాకేష్ శర్మ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమీర్ ఖాన్ దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో 'మహాభారతాన్ని' రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
ఇదిలా ఉంటే.. 2022లో 'లాల్ సింగ్ చద్దా' ఊహించని పరాజయంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్న అమీర్.. ప్రస్తుతం ' సీతారే జమీన్ పర్' చేస్తున్నారు. 2007 లో వచ్చిన సూపర్ హిట్ తారే జమీన్ పర్ సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
latest-news | cinema-news | Aamir Khan Mahabharat
Also Read: Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!