/rtv/media/media_files/2025/08/01/good-touch-and-bad-touch-2025-08-01-20-20-30.jpg)
కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో భాగంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కూడా అవార్డు దక్కింది. ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్
దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణతో కలిసి పనిచేసిన మొదటి సినిమా ఇదే. సాధారణంగా కామెడీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించే రావిపూడి, ఈ సినిమాతో ఒక బలమైన సందేశం ఉన్న కథను చూపించారు. "గుడ్ టచ్, బ్యాడ్ టచ్" అనే కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో చాలా బాగా చూపించి, మహిళా సాధికారతపై సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించారు. బాలకృష్ణ సినిమాలకు ఉండే రొటీన్ మాస్ ఎలిమెంట్స్‌కు భిన్నంగా ఈ సినిమా సాగింది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, కథలో ఎమోషనల్, సామాజిక సందేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సన్నివేశం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సన్నివేశం సినిమాకు ఒక బలమైన సామాజిక సందేశాన్ని జోడించి, ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి సున్నితమైన అంశాన్ని ప్రస్తావించినందుకు దర్శకుడు అనిల్ రావిపూడిని అందరూ అభినందించారు.
ఈ సన్నివేశంలో, భగవంత్ కేసరి (బాలకృష్ణ), తన దత్తత కూతురు విజ్జి పాప (శ్రీలీల)కు ఎదురైన ఒక సమస్యను చూసి చలించిపోతాడు. విజ్జి పాప స్కూల్‌లో తనను ఓ వ్యక్తి అనుచితంగా తాకినా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక భయంతో ఉంటుంది. అప్పుడు భగవంత్ కేసరి నేరుగా స్కూల్‌కు వెళ్లి, అక్కడ ఉన్న పిల్లలందరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరంగా వివరిస్తాడు. ఈ సన్నివేశం సినిమాను కేవలం వినోదం కోసమే కాకుండా, ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా చేసింది. ఈ సీన్ అందర్ని కదిలించి.. . సినిమా విజయంలో కీ రోల్ పోషించింది.
అవార్డుల ఫుల్ లిస్ట్
ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
బెస్ట్ తెలుగు ఫిల్మ్ : భగవంత్ కేసరి
బెస్ట్ తమిళ ఫిల్మ్ : పార్కింగ్
బెస్ట్ హిందీ ఫిల్మ్ : కథల్: ఎ జాక్‌ఫ్రూట్ ఆఫ్ మిస్టరీ
బెస్ట్ పంజాబీ ఫిల్మ్ : గాడ్డే గాడ్డే చా
బెస్ట్ ఒడియా ఫిల్మ్ : పుష్కర
బెస్ట్ మరాఠీ ఫిల్మ్ : శ్యామ్చి ఆయ్
బెస్ట్ మలయాళ ఫిల్మ్ : ఉల్లోజోక్కు
బెస్ట్ కన్నడ ఫిల్మ్ : కందీలు: ది రే ఆఫ్ హోప్
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్ : వాష్
ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్
ఉత్తమ అస్సామీ చిత్రం: రంగతపు 1982
ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సె (12TH ఫెయిల్), షారుక్ ఖాన్( జవాన్)
ఉత్తమ నటి: మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ):రాణీ ముఖర్జీ
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ : హను-మాన్ (తెలుగు)
ఉత్తమ కొరియోగ్రఫీ: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
ఉత్తమ లిరిసిస్ట్ : బలగం ( కాసర్ల శ్యామ్) 'ఊరు పల్లెటూరు' సాంగ్
ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్
ఉత్తమ స్క్రీన్ ప్లే: బేబీ (తెలుగు), పార్కింగ్ (తమిళం)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : వాతి (తమిళం)- పాటలు జీవీ ప్రకాశ్ కుమార్
ఉత్తమ మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: 2018- ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో (మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్: పూకలం (మలయాళం)
స్పెషల్ మెన్షన్: యానిమల్ (రీ-రికార్డింగ్ మిక్సర్) – M R రాధాకృష్ణన్
నాన్-ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీ
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్: ఉత్పల్ దత్త
సినిమాలు
నేకల్: క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం)
ది సీ అండ్ సెవెన్ విలేజెస్ (ఒడియా)
ఉత్తమ స్క్రిప్ట్: 'సన్ ఫ్లవర్స్ వాజ్ ది ఫస్ట్ వన్స్ టు నో' (కన్నడ)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
ఉత్తమ ఎడిటింగ్: మూవింగ్ ఫోకస్ (ఇంగ్లీష్)